Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. సమంత అరోగ్య పరిస్థితి కాస్త కుదుట పడింది.. ప్రస్తుతం సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. ప్రస్తుతం సామ్ శాకుంతలం చిత్రం కోసం పనిచేస్తుంది. తాజాగా సమంత శాకుంతలం డబ్బింగ్ పనులకు మొదలు పెట్టింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన కొటేషన్‌ను రాసుకొచ్చింది సమంత..

సమంత డబ్బింగ్ స్టూడియోలో తీసిన ఫొటోను షేర్ చేస్తూ.. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత నష్టపోయినా, ఈ ప్రపంచం మనల్ని వదిలేసినా తోడుగా ఉండేది కళ ఒక్కటే.. కళ మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం అనే కొటేషన్‌ను రాసుకొచ్చింది సమంత.. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సమంత ఈ పోస్ట్ నాగచైతన్య ను ఉద్దేశిస్తూ రాసిందని అంతా అనుకుంటున్నారు.. తన వల్లే సమంత ఈ రోజు హాస్పిటల్ బెడ్ పై ఉందని అందరికీ తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత శకుంతల పాత్రలో కనిపిస్తుంది.