Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ చిత్రం శాకుంతలం.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత.. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడిన మాటలకు ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంది. అంతేకాదు మీడియా లైవ్ జరుగుతుంది అని కూడా చూడకుండా ఏడవడం అంతా చూశాం.. ఆ ఫోటోలు, విడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కాగా సమంత అంటే గిట్టని కొందరు ఆమె ఎమోషన్ తో ఆటలాడుకుంటున్నారు.. నేటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు..

యశోద సినిమా ప్రమోషన్స్ లో సమంత ఓ ఇంటర్వ్యూలో ఇలాగే కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమా ఈవెంట్ లో కూడా మళ్ళీ కంటతడి పెట్టుకుంది. ఇదంతా సామ్ కావాలని చేస్తుందని.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంతా చేస్తున్న స్ట్రాటజీ అంటూ.. తను ఇలా ఏడిస్తే సినిమా పై హైప్ క్రియేట్ చేసి.. సినిమా హిట్ అవ్వడానికి ఇదొక స్కెచ్.. అంటూ కొందరు నెటిజన్లు సమంత ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. సమంతది దొంగ ఏడుపు అని, కావాలని ఆమె అందరి అటెన్షన్ కోసం ఏడుపును వాడుకుంటుందని దిగజారి మాట్లాడుతున్నారు. అయినా ఇక్కడ ఒక్క విషయం గమనించాలి.. శకుంతలం సినిమా దర్శకుడు గుణశేఖర్ కూడా ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఏడ్చారు. కానీ గుణశేఖర్ ఏడవడం ఎవరూ హైలెట్ చేయలేదు. కేవలం సమంత ఏడుపునే హైలెట్ చేస్తూ తనపై నెగెటివిటీని స్ప్రెడ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.