Samantha: బిగ్ బ్రేకింగ్.. సమంత చేతులకు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Samantha టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన భర్త నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకొని దూరమైన తర్వాత మోటివేషనల్ కోట్స్ మాత్రమే కాదు సినిమా అప్డేట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత పెట్టిన ఒక పోస్ట్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళితే సమంత తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డి కె ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు . ఈ సిరీస్ లో సమంత పూర్తిగా యాక్షన్ లో ఉంటుంది.

Advertisement

An open letter to Samantha Ruth Prabhu, a superstar in every way! | PINKVILLA

Advertisement

ఇందుకోసం ఆమె ప్రత్యేక శిక్షణ సెషన్స్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సిటాడేల్ చిత్రీకరణలో సమంత గాయపడినట్లుగా తెలుస్తోంది. చేతులకు స్వల్ప గాయాలు ,రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి. యాక్షన్స్ సన్నివేషాలని తెరకెక్కిస్తున్నారు .ఇందుకోసం సమంత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.అయితే ఈ ఫోటోలు చూసిన తర్వాత అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement