Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే .. ఇటీవల సమంత నటించిన యశోద సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.. సమంతా నటిస్తున్న లేటెస్ట్ శాకుంతలం సినిమా కూడా ఫిబ్రవరి 17 న విడుదల కానుంది.. తాజాగా సమంత తను ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో ఉందని తెలుస్తోంది..

తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో సమంత పాల్గొనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. మనకు తెలిసిందే బాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లల్లో ఇది ఒకటి. ఈ వెబ్ సిరీస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో సమంత, వరుణ్ ధావన్ కీలక పాత్రలలో కనిపించనున్నరు. ఈ వెబ్ సిరీస్ లో కచ్చితంగా సమంతకు మంచి పేరు తీసుకొస్తుంది అంటూ సమంత ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న కానీ తాను ఇచ్చిన కమిట్మెంట్స్ కి ఏ మాత్రం తగ్గని సమంత ఇలా మళ్లీ షూటింగ్లో పాల్గొనడం సమంత ఫ్యాన్స్ కు కొత్త ఊపునిస్తుంది. కానీ సమంత ఇంకా రెస్ట్ తీసుకోమని చెబుతున్నారు.. ఇంతా జరిగాక సమంత మళ్లీ షూటింగ్ లో పాల్గొనడం మంచిదేనా అని నెటిజన్స్ వాదన.