Sakshi Chowdary: మంచు మనోజ్ పోటుగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ సాక్షి చౌదరి.. ఈ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తరువాత అల్లరి నరేష్ తో జేమ్స్ బాండ్ సినిమాలోని చేసింది. ఈ చిత్రంలో ఓవైపు లేడి డాన్ పాత్రలో మెప్పిస్తూనే మరోవైపు అందాల జాతర చేసింది.. ఆ తరువాత నరేష్ తోనే సెల్ఫీరాజా అనే సినిమాలో కూడా నటించింది.. కానీ ఇవి ఊహించిన స్థాయిలో ఆమెకు గుర్తింపును తీసుకురాలేదు..

ఇక 2019లో సువర్ణ సుందరి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.. అయితే సాక్షి చౌదరికి ఈ సినిమాల తర్వాత ఎలాంటి ఫేమ్ రాకపోయినా సోషల్ మీడియా ద్వారా లైమ్ లైట్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది.
తాజాగా ఈ అమ్ముడు కూరగాయల మార్కెట్లో హాట్ ఫోజులతో రెచ్చిపోయింది .పైన టాప్ గా ఒక స్కార్ఫ్ మాత్రమే చుట్టుకుని జీన్స్ ప్యాంటు వేసుకొని ఉన్న స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత అందం ఆకర్షణ ఉన్నా కూడా ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.