Sai Pallavi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉండేలా చూసుకుంటూ సినిమాలలో దూసుకుపోయింది. ఫిదా సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ విజయం సాధించి.. తనదైన స్టైల్ లో యువతను ఆకట్టుకుంది. అంతే కాదు తాను నటించిన ప్రతి సినిమా కూడా విజయం సాధించేసరికి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా పొందింది.

ఇకపోతే గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతోంది అని.. తన డాక్టర్ వృత్తినే చేపట్టడానికి సిద్ధమవుతోంది అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు మరి కొంతమంది అయితే ఏకంగా ఇండస్ట్రీ నుంచి పారిపోయింది అని కూడా కామెంట్లు చేశారు. అయితే అలాంటి వారికి దవడ పగిలిపోయేలా సూపర్ డూపర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది సాయి పల్లవి.
డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం ఎదురుచూసే సాయి పల్లవి తాజాగా అజిత్ నెక్స్ట్ సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ఆ కారణంగానే ఈ సినిమాలో నటించడానికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఇకపోతే సినిమాలంటే కేవలం గ్లామరస్ కే కాదు నటన పరంగా కూడా హీరోయిన్స్ మెప్పించగలరు అని మరొకసారి ప్రూవ్ చేయడానికి సిద్ధమవుతోంది. మరి అజిత్ తో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందో అంటూ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. సాయి పల్లవి మళ్లీ సినిమాలలో నటించబోతోంది అని తెలిసి ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేవు అని చెప్పవచ్చు.