Samantha: సమంత నాగచైతన్యతో విడిపోయినప్పటినుంచి వీరి గురించి తరచూ ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకునే వరకు ఈ వార్తలు వస్తూనే ఉంటాయి.. అయితే సమంత కి గురువైన సద్గురువు సమంతా కి ఓ సంబంధం చూశారట.. తననే పెళ్లి చేసుకోమని సద్గురు సలహా ఇస్తున్నారట..
సమంత మయోసైటీస్ నుంచి బయటపడి మన ముందు ఇప్పుడు సంతోషంగా తిరుగుతుంది అంటే అందుకు కారణం సమంత స్నేహితుడట. గత కొన్ని నెలలుగా అతను సమంతాతో పాటే ఉంటూ తన అనారోగ్య సమస్య అధిగమించేలాగా చేశారట.. అంతేకాదు సమంతని లోని లోటు పాట్లు కష్టనష్టాలు అన్నీ దగ్గరుండి తనే చూసారట.. ఇక సమంత ఎప్పుడూ మనసు బాగో లేకపోయినా తన లక్ష్యం నుంచి డివియేట్ అవుతున్న ప్రతిసారి తనే సమంతకి మనో ధైర్యాన్ని ఇచ్చాడట.
సమంతని మోటివేట్ చేస్తూ నువ్వు కోల్కోగలవు.. మా అందరి ముందు ధైర్యంగా నిలబడగలవు. నువ్వు మళ్ళీ మామూలు సమంతావి అవుతావు అంటూ తనలో మానసిక ధైర్యాన్ని నింపారట ఆమె స్నేహితుడు. డాక్టర్స్ ఇచ్చే మందులు ఎంతగా పనిచేశాయో.. సమంతకి అతను చెప్పిన మాటలు కూడా అంతే వేగంగా పనిచేశాయట.. ఇక సమంత హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులే కాకుండా యశోద సినిమా ప్రమోషన్లకు కానీ ఇటీవల శాకుంతలం సినిమా ప్రమోషన్లలో సమంత ధైర్యంగా మనందరి ముందుకి రావడానికి కారణం సమంత స్నేహితుడైనని సమంత సద్గురువుకి చెప్పిందట.
మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ స్నేహం మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావాలని సద్గురు సమంతా కి సలహా ఇచ్చారట. నీ కష్టనష్టాలు తెలుసుకున్న నీ స్నేహితుడే.. నీ భర్త అయితే నీ జీవితం ఇంకా ఆనందంగా ఉంటుందని ..గడిచిపోయిన గతాన్ని మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెట్టమని సద్గురు సమంతకి చెబుతున్నారట . కానీ సమంత మాత్రం సద్గురు విషయాన్ని లైట్ తీసుకుంటుందని వారి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.