Wife Twist : తన భార్యనే లేపుకెళ్ళాడని.. వాడి భార్యపై కన్నేసి కసితీరా పగ తీర్చుకున్నాడు..

Wife Twist : తన భార్యను లేపుకెళ్ళాడని వాడి భార్యను లేపుకెళ్ళాడు బీహార్ లోని కాగాడియా జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. చౌదరి గ్రామంలోని అడ్డుగా బ్లాక్ లో నీరజ్ రూబియా అనే దంపతులు ఉన్నారు. వీరికి పెళ్ళై నలుగురు కుమారులు ఉన్నారు. కానీ రుబియా కి అదే గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. వీళ్ళిద్దరూ నాలుగేళ్ల పాటు గ్రామంలోనే ప్రేమించుకున్నారు. శారీరకంగా కూడా కలిశారు. కానీ కులం వేరు కావడంతో వేరే పెళ్లి చేసుకోలేకపోయారు. ముఖేష్ తల్లిదండ్రులు ఒప్పుకోరు అని రూబీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి ముఖేష్ భార్య పేరు రూబీ తన ప్రేయసి పేరు రూబియా. ముఖేష్ పెళ్లి చేసుకున్నాకాని రూబీ కంటే రూబియా మీదే ప్రేమ ఎక్కువగా ఉంది. మరోవైపు రుబియా పరిస్థితి కూడా అంతే. తనకి నలుగురు పిల్లలు ఉన్నా కూడా ముఖేష్ అంటేనే ఇష్టం. ఒకరోజు ఇక తన ముగ్గురు కొడుకులని తీసుకొని రూబియా తన ప్రియుడు ముఖేష్ తో లేచిపోయింది. దాంతో గ్రామంలో గందరగోళం నెలకొంది.

ముఖేష్ ఫోన్ నెంబర్ కనుక్కొని గ్రామస్తులు తనని గ్రామానికి పిలిచారు. అప్పుడు ముఖేష్ తో పాటు రుబియా రాలేదు. దాంతో నీరజ్ ముఖేష్ ని నా భార్యను తీసుకెళ్లడానికి నీకు ఎంత ధైర్యం అంటూ గొడవ పడ్డాడు. నువ్వు ఎప్పుడో తాళి కట్టావు. నేను ఇప్పుడే తాళి కట్టాను. తను నా భార్య. నాతోనే ఉంటుంది. నీతో రాదు అని ముఖేష్ కరాకండిగా చెప్పేస్తారు. మరో వైపు రూబీ కూడా తన భార్య గానే ఉంటుందని ముఖేష్ గ్రామస్తుల ముందు ఒప్పుకున్నాడు. దాంతో నీరజ్ కోపం పెంచుకున్నాడు. తన భార్యను లేపుకెళ్లిన కోపంతో ముఖేష్ భార్య రూబీ కి మెల్లమెల్లగా దగ్గరయ్యాడు.

తన ఫోన్ నెంబర్ తీసుకొని మీ భర్త నీకు ఫోన్ చేశాడా అని అడుగుతూ ఉండేవాడు. మరోవైపు రూబీ కూడా నీరజ్ కి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మీ భార్య మీకు ఫోన్ చేసిందా అంటూ ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకునే వాళ్ళు. ఇక ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇక రూబికి దగ్గు వచ్చినా జలుబు వచ్చిన నీరజ్ తనకి టాబ్లెట్స్ తీసుకెళ్లి ఇచ్చేవాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఒకరోజు నీరజ్ రూబీ ని పెళ్లి చేసుకుంటానని ధైర్యం చేసి అడిగేసాడు. రూబీ కూడా అందుకు ఒప్పుకుంది. ఇక గ్రామ పెద్దలందరికీ చెప్పి రూబీ ని తీసుకొని గుడిలో పెళ్లి చేసుకున్నాడు.

నీరజ్ కి బోలెడంత ఆస్తి ఉంది. 20 ఎకరాల ఆసామి.. పైగా పాత భార్య లేచిపోయినా. రూబీ లాంటి అందగత్తే వచ్చింది. తనకి పిల్లలు కూడా లేరు. పాత భార్య పోతేనే కొత్త భార్య రూబీ అన్ని విధాలుగా సేవలు అందిస్తుంది. మరోవైపు ముఖేష్ కి పెద్దగా ఆస్తులు పాస్తులు పెద్దగా ఏమీ లేవు. రూబియా ప్రియుడు తో ఇబ్బందులు పడుతుంటే.. తన భార్యను లేపుకు వెళ్ళాడు అన్న కోపంతో ముఖేష్ భార్య రూబిని లైన్ లో పెట్టి పెళ్లి చేసుకున్నాడు నీరజ్..