Money Investing : కేంద్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజలను ఉన్నతస్థాయికి తీర్చిదిద్దడానికి ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తూ ఆర్థికంగా వారికి సహాయపడుతుంది. సాధారణంగా ఏదైనా పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను మినహాయింపు అయితే ఉండదు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో మనం చేరినట్లు అయితే పన్ను మినహాయింపు సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు లభించడం గమనార్హం. అట్టడుగు వర్గాల వారికి ఏకంగా 2 లక్షల రూపాయలు మిగిలాయి అంటే అది గొప్ప విషయమే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజనా పథకం కూడా ఒకటి. లైఫ్ ఇన్సూరెన్స్ పథకం కింద ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండు లక్షల రూపాయలు మన చేతికి వస్తాయి. అయితే ఈ పథకం లో చేరడం వల్ల ప్రమాదవశాత్తు ఖాతాదారుడు మరణిస్తే ఆ రెండు లక్షల రూపాయలు వారి కుటుంబానికి వర్తిస్తాయి అని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ లో చేరితే ఏడాదికి రూ.289 చెల్లించాల్సి ఉంటుంది. ఏజెంట్ కమిషన్ 30 రూపాయలు, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు 11 రూపాయలు మొత్తం కలుపుకొని రూ.330 ఏడాదికి చెల్లించాలి.

అంతే కాదు బ్యాంకు ఖాతాలో అయితే ఆటో డెబిట్ ఫెసిలిటీ కూడా మనం పెట్టవచ్చు. ఇలా పెట్టడం వల్ల ఖాతా నుంచి నేరుగా ప్రతి ఏడాది 330 రూపాయలు కట్ అవుతాయి. 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు . ఇక పోస్టాఫీసులలో కూడా మీరు ఈ పథకంలో చేరవచ్చు. ఇక పథకంలో చేరిన తరువాత ప్రతి సంవత్సరం మే 31 వ తారీకు రోజు మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. కాబట్టి ఈ పథకంలో ఎవరైనా సరే చేరవలసి వస్తే దగ్గరలో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డబ్బులు కట్టవచ్చు.