RK.ROJA: లోకేష్ ఒక పిచ్చోడు.. రోజా..!!

RK.Roja.. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. అలా లోకేష్ కూడా అధికార పార్టీ వైసీపీ పైన 10 రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉండే PLR కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేతలతో కీలక భేటీ చేయడం జరిగింది. దీనిని మంత్రి పెద్దారెడ్డి రామచందర్ రెడ్డి, నారాయణస్వామి చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది.

Advertisement

RK Roja:లోకేశ్ అంకుల్.. ఐరన్ లెగ్: మంత్రి రోజా
ఈ సందర్భంగా నే మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు లోకేష్ తీరు ఉందని లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు ఇలాగే మాట్లాడితే లోకేష్ దెబ్బలు తింటాడు అంటూ లోకేష్ కూడా అదే కావాలని కోరుకున్నట్లు ఉందంటూ రోజా తెలిపింది. మంత్రి పెద్దారెడ్డి కన్నెర్ర చేస్తే లోకేష్ అసలు తిరగగలడా..? చంద్రబాబు ,లోకేష్ కు దమ్ముంటే చిత్తూరులో పోటీ చేయండి.. లోకేష్ ఒక పిల్ల వెదవ అంటూ కామెంట్ చేసింది. లోకేష్ మాట్లాడిన ప్రతి మాటకి దమ్ముంటే ఆధారాలతో ప్రూవ్ చేయమంటూ రోజా ఫైర్ అయ్యారు.

Advertisement
Advertisement