Redmi k50i : దేశంలోనే పలు టెక్ దిగ్గజ మొబైల్ తయారీ సంస్థలలో రెడ్మి కూడా ఒకటి. రెడ్మి తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీలతో స్మార్ట్ఫోన్లను ప్రవేశ పెడుతూ తక్కువ ధరలకే వాటిని అమ్మకానికి పెడుతూ ఉంటుంది.ఇక ఈ క్రమంలోనే తాజాగా మరొక స్మార్ట్ ఫోన్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది రెడ్మీ. మనం బ్యాంక్ ఆఫర్స్ తో తక్కువ ధరకు సొంతం చేసుకోవడమే కాకుండా అద్భుతమైన ఫీచర్లను కూడా ఈ స్మార్ట్ ఫోన్ లను పొందవచ్చు. ఇటీవల రెడ్ మీ కే సిరీస్ లో రెడ్మి k50i స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. ఇకపోతే గతంలో విడుదలైన రెడ్మీ కె సిరీస్ మొబైల్స్ కు మంచి ఆదరణ లభించింది.
అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఈ మొబైల్స్ లేవని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలో రెడ్మి k50i స్మార్ట్ ఫోన్ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ స్మార్ట్ మొబైల్ ద్వారా కూడా కేవలం రూ.25వేల లోపే బడ్జెట్ ధరలో రిలీజ్ అవడం గమనార్హం. ఇక ఇందులో ఉండే ఫీచర్స్ విషయానికి వస్తే డైమండ్ సిటీ 8100 ప్రాసెసర్ తో.. 5080Mah బ్యాటరీ ని ఈ స్మార్ట్ మొబైల్ కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం 2 వేరియంట్ లలో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యింది. 6 GB Ram + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.25,999 లాగా.. 8 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ తో రూ.28,999 కే లభించనుంది.
ఇకపోతే రెడ్మి అధికారిక వెబ్సైట్లో జూలై 23వ తేదీ నుంచి అందుబాటులోకి రావడం జరిగింది. ఇక ఇందులో వచ్చిన ఆఫర్ల విషయానికి వస్తే.. అమెజాన్ కూపన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక అదే పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే అదనంగా రూ.2500 డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ లో కూడా రూ.1000 తగ్గింపు కూడా ఉంది. ఇక వీటన్నింటినీ కలుపుకొని మీరు 6 GB Ram + 128 GB స్టోరేజ్ వేరియంట్ ను మీరు కేవలం రూ.20,999 , 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 ధర కే సొంతం చేసుకోవచ్చు. మూడు కలర్స్ లో మీకు అందుబాటులో ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తో 6.6 అంగుళాలు ఫుల్ హెచ్డి డిస్ప్లే ను పొందవచ్చు.