Redmi 11 Prime 5G : ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ షావోమీ సరికొత్తగా ఇండియన్ మార్కెట్లోకి రెడ్మి 11 ప్రైమ్ సిరీస్ లో రెండు మొబైల్స్ ను రిలీజ్ చేసింది. ఒకటి రెడ్మీ 11 ప్రైమ్ 5G కాగా మరొకటి రెడ్మి 11 ప్రైమ్ 4G.. ఈ మోడల్స్ రిలీజ్ చేయడం గమనార్హం. ఇక ఈ రెండు మొబైల్స్ కూడా రూ.15,000 లోపు బడ్జెట్లో రిలీజ్ కావడం విశేషం. ఇక దివాలీ విత్ మీ ఈవెంట్ లో భాగంగా షావోమీ తాజాగా మొబైల్స్ ను లాంఛ్ చేసింది. తొలి స్మార్ట్ ఫోన్ రెడ్మి A1 ని కూడా లాంఛ్ చేసింది. రెడ్మీ A1 రూ.10,000 లోపు బడ్జెట్లో విడుదల అయింది. మిగతా రెండు స్మార్ట్ ఫోన్ల వివరాలను ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.
రెడ్ మీ 11 ప్రైమ్ 5G : ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక ఐసిఐసిఐ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక ఈ ఆఫర్ తో రెడ్మీ 11 ప్రైమ్ 5G 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక కలర్స్ విషయానికి వస్తే మెడో గ్రీన్ , క్రోమ్ సిల్వర్, థండర్ బ్లాక్ వంటి కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు.
ఇక సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ఫోన్ అమ్మకానికి రానుంది. ముఖ్యంగా అమెజాన్ లో మీరు కొనుగోలు చేయవచ్చు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 90 Hz రీఫ్రెష్ రేట్ తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా , 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్ అమర్చబడి ఉంది. ఇక సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చారు. ఇక ఇందులో 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000 mah బ్యాటరీని కూడా అమర్చడం జరిగింది. ఇక రెడ్మి 11 ప్రైమ్ 4G కూడా రెండు వేరియంట్లలో.. 5G స్మార్ట్ ఫోన్ ధరలలో, ఫీచర్స్ లో కొనుగోలు చేయవచ్చు.