Realme GT Neo 3T : ప్రస్తుతం రోజు వారి జీవితంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ నిత్యవసరంగా మారిపోయింది. అందుకే టెక్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లతో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను ప్రవేశ పెడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ప్రస్తుతం రియల్ మీ కంపెనీ కూడా భారత్లో ఎట్టకేలకు తన కొత్త ఫోను విడుదల చేసింది. ఇక అదే రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్. GT సీరీస్ లో ఇది తాజా ఫోన్ కావడం గమనార్హం. క్వాలికం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఇక కొత్త ఫీచర్లు కొన్ని నూతన అప్ గ్రేడ్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి కంపెనీ విడుదల చేయడం జరిగింది.
ఇక ఈ ఫోన్ యొక్క ఫీచర్ విషయానికి వస్తే 6.6 అంగుళాల 120 Hz రీఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో.. ఈ స్మార్ట్ ఫోన్ టచ్ స్యాంప్లింగ్ రేట్ 360HZ, గరిష్ట బ్రైట్నెస్ 1300 నిట్స్ గా ఉన్నాయి.. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 6 GB ర్యామ్+ 128GB స్టోరేజ్ వేరియంట్ తో, ఇక మరొక వేరియంట్ విషయానికి వస్తే 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ తో రానుంది. ఇక అంతే కాదు 8 5Gబ్రాండ్లకు సపోర్ట్ చేయనున్న ఈ ఫోన్ లో రెండు నానో సిమ్ లను వాడుకోవచ్చు..
ఇతర కెమెరా విషయానికి వస్తే 60MB ప్రధాన కెమెరా , 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫి కోసం 16 MP ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడింది. ఇక ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ ధర విషయానికి వస్తే 6 GB వేరియంట్ రూ.29,999.. 8GB /128GB వేరియంట్ ధర రూ.31,999. ఇక 8GB / 256GB వేరియంట్ ధర రూ.33,999 గా ఉన్నాయని కంపెనీ స్పష్టం చేసింది ఇక సెప్టెంబర్ 23 నుంచి అన్ని స్టోర్లలో అందుబాటులోకి రాబోతోందని కూడా కంపెనీ వెల్లడించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు సమాచారం.