Realme Watch 3 : రియల్ మీ నుంచి అద్భుతమైన ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే..!!

Realme Watch 3 : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా అన్ని విషయాలలో చాలా స్మార్ట్ గా ఉండాలని అనుకుంటున్నారు . ఈ క్రమంలోనే స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ అలాగే స్మార్ట్ వాచ్ లను కూడా ఉపయోగించాలని చాలామంది ఆలోచిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కటి స్మార్ట్ గా ఉండాలని కోరుకునే వారికి బెస్ట్ ఫీచర్లతో కూడిన అద్భుతమైన స్మార్ట్ వాచ్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అది కూడా అన్ని రకాల స్పెసిఫికేషనులతో, ఫీచర్లతో, అద్భుతమైన ధరలతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ముందుండే రియల్ మీ ఈసారి కూడా అద్భుతమైన ఫీచర్లతో కూడిన రియల్ మీ వాచ్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.

Advertisement

ముఖ్యంగా బడ్జెట్ రేంజిలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో ఈ స్మార్ట్ వాచ్ లభించడం గమనార్హం. ఇక రియల్ మీ ప్యాడ్ ఎక్స్ తో పాటు నిన్న ఇండియాలో ఈ స్మార్ట్ వాచ్ ను విడుదల చేశారు. ఇక 1.8 ఇంచుల స్క్వేర్ సైజు డిస్ప్లే తో బ్లూటూత్ కాలింగ్ ఈ స్మార్ట్ వాచ్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. ఇకపోతే రియల్ మీ వాచ్ 2 కి సక్సెసర్ గా ఈ రియల్ మీ వాచ్ 3 ని విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో 110 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ కి స్మార్ట్ వాచ్ సపోర్ట్ ఇస్తుంది. అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ తో పాటు స్లీప్ ట్రాకింగ్ హెల్త్ ఫ్యూచర్లతో ఈ స్మార్ట్ వాచ్ లభిస్తుంది. రియల్ మీ అందిస్తున్న ఈ స్మార్ట్ వాచ్ 3 రూ.3,499 కాగా.. మొదటి సేల్ లో భాగంగా కేవలం మీరు రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకునేవారు.

Advertisement
Realme best smart Realme Watch 3
Realme best smart Realme Watch 3

ఆగస్టు 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ వాచ్ సేల్ మొదలవుతుంది. ఇకపోతే ఈ కామర్స్ దిగ్గజాలైనటువంటి ఫ్లిప్కార్ట్ లో మీరు ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయవచ్చు. ఇక అంతే కాదు గ్రే , బ్లాక్ కలర్ ఆప్షన్ లో కూడా ఈ స్మార్ట్ వాచ్ లభిస్తుంది. 240X286 పిక్సెల్ రిజర్వేషన్ తో ఈ స్మార్ట్ వాచ్ లభించడంతోపాటు స్క్వేర్ షేప్ డిస్ప్లే 500 నిట్స్ తో ఉంటుంది. ఇక వాచ్ ద్వారానే కాల్స్ కూడా చేయవచ్చు. ఇన్బిల్ట్ మైక్రోఫోన్ స్పీకర్లు కూడా ఉంటాయి. ఇక ఆడియో క్వాలిటీ మెరుగ్గా ఉండడానికి పవర్ ఆమ్ప్లిఫయర్ ని కూడా పొందుపరిచారు. 340ఎంహెచ్ బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇక పూర్తి చార్జ్ అవ్వడానికి 2.25 గంటల సమయం పడుతుంది. డస్ట్ అలాగే వాటర్ రెసిస్టెంట్ తో ఈ స్మార్ట్ వాచ్ లభించడం గమనార్హం.

Advertisement