Realme 5G Smart Phones : రియల్ మీ నుంచి లాంఛ్ అవుబోతున్న 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే..!!

Realme 5G Smart Phones : ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి రియల్ మీ దేశంలో దృష్టిలో పెట్టుకొని త్వరలోనే తమ కంపెనీ నుంచి ధరలవారీగా అలాగే స్టోరేజ్ వారీగా 5G స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతోంది. ఇక ఇటీవల రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ షేత్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసి సమాచారాన్ని అందించారు. ఇక ఆయన తెలిపిన సమాచారం మేరకు రియల్ మీ ఎగ్జిక్యూటివ్ సంస్థ ఈ సంవత్సరం భారతదేశంలో కొత్తగా 5G స్మార్ట్ ఫోన్ పరిచయం చేయనున్నట్టు ఆయన తెలిపారు.. మేము దీని యొక్క విశిష్టత మరియు ప్రత్యేక డివైస్ పై అధికంగా దృష్టి పెడుతున్నందున రాబోయే పండుగ సీజన్లో వినియోగదారులకు అందుబాటులో ఉండి.. దీని యొక్క డిమాండ్ పుంజుకుంటుందని మేము భావిస్తున్నాము..

త్వరలోనే 4 కొత్త ఉత్పత్తులను కూడా పరిచయం చేయబోతున్నామని రాబోయే స్మార్ట్ ఫోన్ ల గురించి వివరాలు వెల్లడించకుండా పోస్టులో వెల్లడించారు సీఈవో మాధవ్. 2022లో భారతదేశం యొక్క #5G రోల్ అవుట్ కి ఇది అదనంగా ఉంటుంది అని ఆయన తెలిపారు. ఇక అంతేకాదు భారతదేశంలో 5G స్మార్ట్ ఫోన్లను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మా కంపెనీ కృషి చేస్తోంది . త్వరలోనే భారత దేశంలో రియల్ మీ 9i 5G తో పాటు మరో 3 స్మార్ట్ ఫోన్ లను ప్రారంభించాలని కంపెనీ యోచేస్తోంది అని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక అలాగే రియల్ మీ #Democratizer of 5G కావాలి అని , ఇక అందుకోసం నిరంతరం కృషి చేస్తాము అని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇకపోతే 5G అనేది కొందరికే కాకుండా అందరికీ అందుబాటులో వచ్చేలాగా నిరంతరం కృషి చేస్తున్నట్లు సమాచారం.

Realme 5G Smart Phones to be launched
Realme 5G Smart Phones to be launched

రియల్ మీ 9i 5 G ధరలను కూడా కస్టమర్లకు అలాగే సామాన్లను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకే విడుదల చేస్తామని కూడా వెల్లడించారు. ఇక కంపెనీ స్పష్టం చేసినట్లుగానే రియల్ మీ 9i 5G నీ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి మార్కెట్ ధర రూ.17,999. ఇక దానిని ఈ – కామర్స్ ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3,000 తగ్గింపుతో రూ.14,999కి సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే అదనంగా 1000 రూపాయలు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు కేవలం రూ.13,999కి లభించడం గమనార్హం. స్టోరేజ్ విషయానికి వస్తే 4GB , 6GB ర్యామ్ , 128 GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోను మీడియాటెక్ డైమండ్ సిటీ 81056 చిప్స్ ద్వారా అందించబడుతుంది అని, లేజర్ లైట్ డిజైన్తో వచ్చింది.