Realme Smart TV : ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ (BBD) సేల్ ను నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి అప్లయేన్సెస్ పై 80% డిస్కౌంట్ కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రియల్ మీ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.11, 000 లోపే కొనుగోలు చేయడానికి మరింత ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్కార్ట్. మరి ఈటీవీ , ఫీచర్స్, ధరలు అన్ని ఒకసారి చదివి తెలుసుకుందాం. రియల్ మీ 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మీకు 43 అంగుళాల డిస్ప్లే తో లభిస్తుంది.
1920 x 1080 పిక్సెల్ రెజల్యూషన్ తో ఫుల్ హెచ్డి క్వాలిటీతో లభించే ఈ స్మార్ట్ టీవీ 60 HZ రీఫ్రెష్ రేట్ తో, 24W సౌండ్ ఔట్ పుట్ ను అందిస్తుంది. ఇక గూగుల్ అసిస్టెంట్ తో పాటు క్రోమ్ కాస్ట్ ఇన్ బుల్ట్ కూడా వస్తున్నాయి. ఇక అంతేకాదు సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , యూట్యూబ్ వంటి పలు వినోద ఓటిటి యాప్స్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.21,999.. కానీ ఫ్లిప్కార్ట్ 21 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.21,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు రూ.1,100 తగ్గింపు ను ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే పొందవచ్చు..
మరో అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.. ప్రస్తుతం మీ పాత టీవీని ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.11,000 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. అన్ని ఆఫర్స్ వర్క్ ఇస్తే ఈ స్మార్ట్ టీవీ ని రూ.11వేల లోపే సొంతం చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే..3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ తో పాటూ ఇన్బిల్ట్ వైఫై కూడా కనెక్ట్ చేయబడుతుంది. మంచి వినోదాన్ని కలిగించే ఈ స్మార్ట్ టీవీ మీకు తప్పకుండా థియేటర్ అనుభూతిని కల్పిస్తుంది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇంతటి ఖరీదైన స్మార్ట్ టీవీ మీకు ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం.