Real Story: ప్రతి అమ్మాయి తనను ప్రేమించే భర్త రావాలని కోరుకుంటుంది.. తన భర్త ధ్యాసంతా కూడా తన మీదే ఉండాలని కోరుకుంటుంది నా కొంగు పట్టుకుని భర్త తిరగాలని ఆశపడుతుంది తన మాటకి ఎదురు చెప్పని.. తన మాటే వినే భర్త కావాలని ఆశపడుతుంది.. అలాంటి లక్షణాలు ఉన్న భర్త తనకు వస్తే రాధిక మాత్రం వద్దు అని అంటుంది.. రాధిక మనోవేదన ఏంటి తన భర్త ఈ విషయంపై ఎలా స్పందించాడో ఇప్పుడు తెలుసుకుందాం..
సుమన్ టీవీ లైఫ్ ఛానల్ లో ప్రసారమయ్యే అందమైన జీవితం అనే షోలో ఎపిసోడ్ 56 లో.. రాధిక పెళ్లయింది. సొంతూరు తెనాలి. ఉండేది హైదరాబాద్.. తను తన భర్త చూపించే అతి ప్రేమ మీద ఉక్కిరిబిక్కిరి అవుతుంది ఈ సమస్య నుంచి గట్టెక్కించమని అందమైన జీవితం కి మెయిల్ చేసింది.. ఆ సమస్యను అడిగి తెలుసుకోవడానికి యాంకర్ రాధికకు ఫోన్ చేసింది. షోలో చక్రవర్తి గారు కూడా ఉన్నారు అని చెప్పింది..
తన భర్త తనమీద అతి ప్రేమ చూపిస్తున్నారని తన చేత వంట చేయనివ్వడం లేదని పెళ్లయిన కొత్తలో ఒకసారి వంట చేస్తే తన చెయ్యి కాలిందని.. అప్పటినుంచి ఇప్పటివరకు వంట చేయనివ్వడం లేదని తన బంధువులు సన్నిహితుల మధ్య కూడా వాళ్ళు తిన్న కంచాలను కూడా నన్ను తీయనివ్వకుండా తనే తీస్తాడని.. నేను ఏం చెప్పినా కూడా నా మాట జవదాటడని..
మేము ఇద్దరం బయటకు వెళ్తే ఎవరైనా నన్ను చూస్తే వెంటనే నా వైపు తను తిరిగి చూస్తాడు. నేను వాళ్ళని చూస్తున్నా లేదా అని గమనిస్తాడు ప్రతిరోజు ఫోన్ చేసి తిన్నాను, తినలేదా అని అడుగుతాడు అదే నాకు ఆరోగ్యం బాగోలేకపోతే మాత్రం ప్రతి గంటకు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటాడు. సాధ్యమైనంత వరకు ఆరోజు సెలవు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లినా కూడా నా కొంగు పట్టుకుని అక్కడికి వస్తాడు.. నన్ను ప్రశాంతంగా వాళ్లతో మాట్లాడుకొనివ్వడు. అని రాధిక తన సమస్యలను వివరించి చెబుతుంది.
ఇక తన సమస్య విన్నా కళ్యాణ్ చక్రవర్తి నీ భర్తకు నీ మీద ఏమైనా అనుమానం ఉందా అంత అతి ప్రేమ చూపించాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అడుగుతారు.. అదే నాకు అర్థం కావడం లేదని ఈ అతి ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను అని రాధిక అంటుంది. అయితే నీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడదాం అని చెప్పగానే రాధిక తన భర్తకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటుంది. చెప్పు బంగారం అన్ని అనగానే అందమైన జీవితం కి నేను మెయిల్ చేశానని కౌన్సిలింగ్ ఇవ్వడానికి వాళ్ళు ఫోన్ చేశారని చెప్పగానే.. తన భర్త తనని పళ్ళెత్తి మాట కూడా అనకుండా నీ ఇష్టం మాట్లాడదాం అని చెబుతాడు.
ఇక ఉన్న సమస్య చెప్పగానే నా భార్య మీద నాకు ఎలాంటి ఇన్ సెక్యూరిటీ భావన లేదని.. తనంటే నాకు చాలా ఇష్టం అని.. మా అమ్మ అని మా నాన్న ఎప్పుడూ ప్రేమగా చూడలేదని.. కనీసం తిన్నావా అని కూడా అడగలేదు.. అలా నా భార్య బాధపడకూడదు అని తనని ఇంత ప్రేమగా చూసుకుంటున్నానని అతను చెబుతాడు… ఇంకా ఆ మాటలు విన్న తర్వాత కళ్యాణ్ చక్రవర్తి రాధిక కి కౌన్సిలింగ్ ఇస్తారు.
నువ్వు మీ ఫ్రెండ్స్ మీ బంధువులు తప్పుగా అనుకుంటారని అనుకుంటున్నావు. కానీ నీ భర్త నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు.. ఆ ప్రేమ దొరకడం చాలా అదృష్టం.. మీ ఫ్రెండ్స్ నిన్ను తప్పుగా అనుకుంటూ కామెంట్స్ చేస్తే నువ్వే ఒక సమాధానం చెప్పు.. నా భర్తకి నేనంటే ప్రాణం ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం అని ఒక్క కామెంట్ ఆ గ్రూపులో పోస్ట్ చెయ్యి.. వాళ్ళందరి నోర్లు మూతపడతాయి. అలాగే తన భర్తకి కూడా తను సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది. కాస్త మీ ప్రేమను అదుపులో ఉంచుకోమని సలహా ఇస్తారు.