Rashmika: ఒరేయ్ పాపం రా .. రష్మిక ని జీవితం సర్వనాశనం చేసారు కదరా .. నికృష్టపు వెధవల్లారా !

Rashmika: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల రష్మిక మందన కన్నడ ఇండస్ట్రీలో ఎలాంటి ట్రోల్స్ ని ఎదుర్కొంటుందో తెలిసిన విషయమే. రష్మిక ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలి అనేంత దాకా ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.. తనని ట్రోల్ చేసేవారికి రష్మిక ఓ వీడియోతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది..

Rashmika Mandanna balls push ups video viral
Rashmika Mandanna balls push ups video viral

తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో జిమ్ లో ఆమె రెండు వెయిట్ బాల్స్ మధ్య బాడీని బ్యాలెన్స్ చేస్తూ పుష్ అప్స్ తీస్తుంది. నిజానికి ఇలా బాల్స్ మీద బాడీని బ్యాలెన్స్ చేయడం చిన్న విషయం అయితే కాదు. కాని రష్మిక మాత్రం ఆ ఫీట్ కూడా చేసి ఎట్రాక్ట్ చేస్తుంది. ఇక ఈ వీడియోకి అదిరిపోయే విధంగా ఓ చిన్న స్టోరీ కూడా రాసుకొచ్చింది అమ్మడు..

ఒకప్పుడు ఒక స్ట్రాంగ్ విమెన్ ఉండేది అని నేను ఫ్యూచర్ లో నా గురుంచి చెప్పుకోవాలి. అలాంటి స్ట్రాంగ్ విమెన్ గా ఉండటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ వీడియో.. ఒక అమ్మాయిగా నువ్వు ఏం చేయగలవు అనుకునే ప్రతి ఒక్కరికి నేను ఇది కూడా చేయగలను అని చేసి చూపించాలని అనుకుంటాను.

అందులో భాగమే ఇది. క్రేజీగా అనిపించినా కూడా ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటే కచ్చితంగా చేసి చూపించొచ్చు.. అయితే దాని కోసం ఫోకస్ చేసి గట్టిగా ప్రయత్నం చేయాలి. అలా చేస్తే అనుకున్నది సాధ్యం అవుతుంది అంటూ చిన్న స్టొరీ రాసుకొచ్చింది.

ఈ స్టొరీలైన్ కచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయికి స్పూర్తినిచ్చే విధంగా ఉందని చెప్పాలి. అందుకే ఈ వీడియోకి ఏకంగా 7 లక్షల 83 వేలకి పైగా లైక్స్ వచ్చాయి. కాగా ఎన్ని రోజులు నుంచి రష్మికను బాయ్కాట్ చేసిన వాళ్లందరూ కూడా ఈ స్టోరీ చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. అనవసరంగా ఆమెను బాధ పెట్టమని అనుకుంటున్నారు. రష్మిక మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఈ పోస్ట్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ పోస్ట్ చూసి ఇప్పటివరకు తనను విసిగించిన వాళ్ళందరూ మారాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.