Rashmika: నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందనకి పిచ్చి ఏమైనా పట్టిందా.. కాకపోతే మరేంటి.. ఇలాంటి బంగారం లాంటి అవకాశం ఎవరైనా చేతి వరకు వస్తే వదులుకుంటారా.. అసలే ఇప్పుడు తన టైం బాలేదు.. ఈ సమయంలో మళ్ళీ ఇదొకటా అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు.. ఇంతకీ ఏం జరిగిందంటే.!?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అందరికి తెలిసిందే.. అయితే ఇలాంటి టైంలో తారక్ తో నటించే అవకాశం వస్తే కేవలం రెమ్యూనరేషన్ తక్కువ ఇస్తారన్న కారణంతో ఆ సినిమాని రిజెక్ట్ చేయడం మూర్ఖత్వం అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కొరటాల శివ డైరెక్షన్ లో తారక్ నటించబోతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో మొదటి హీరోయిన్ గా రష్మిక మందన పేరు ఫిక్స్ అయినట్లు సమాచారం. కాగా రష్మిక మందన ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా ఏడు కోట్ల డిమాండ్ చేసిందట. అయితే అంత రెమ్యునరేషన్ ఇవ్వలేం అని కాస్త తగ్గించమని రిక్వెస్ట్ చేయగా.. రష్మీక ఈ సినిమా విషయంలో హోల్డ్ లో పెట్టారని టాక్. ఈ విషయంలోనే నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. తారక్ తో సినిమా అందుకోవడమే గొప్ప. అలాంటిది రెమ్యునరేషన్ కోసం మిస్ చేసుకుంటే నీ కన్నా పిచ్చి మనుషులు ఎవరు ఉండరు అంటూ కామెంట్ చేస్తున్నారు.. అయినా నీ నెత్తి మీద దరిద్రం తాండవం చేస్తుంటే ఎవరేం చేస్తారు అంటూ మరో నేటిసన్ కామెంట్ చేయడం హైలైట్ గా మారింది.