Margadarsi Case : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగినట్లు రామోజీరావు పై కేసు వేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణ కూడా జరుగుతూ ఉంది. A1గా రామోజీరావు A2గా చెరుకూరి శైలజలను సిఐడి గత కొద్ది రోజుల నుండి విచారణ చేస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న రామోజీరావుని మంచం పడకపై విచారణ చేయించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మార్గదర్శిలో అక్రమాలు జరిగినట్లు.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పటినుండో పోరాడుతూ ఉన్నారు.

2007వ సంవత్సరం నుండి ఈ కేసును టేకప్ చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రుల అందరు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ హయాంలో.. అనేక ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. కానీ జగన్ ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకోవడంతో సిఐడి విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో రామోజీరావు ఎటువంటి అవకతవకులకు పాల్పడలేదని… మేధావులు చెప్పుకొస్తున్నారు. చిట్ ఫండ్ వ్యాపారం పేరిట ఎవరికి.. రామోజీరావు డబ్బులు ఎగ్గొట్టలేదు.
సో ఈ కేసులో ఎటువంటి అక్రమాలు జరగలేదు.. ఖచ్చితంగా ఆయనకి క్లీన్ చిట్ రావడం గ్యారెంటీ అని పేర్కొంటున్నారు. ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా చిట్ ఫండ్ కంపెనీలు ఏతేస్తే కేసులు ఉంటాయి. రామోజీరావు మార్గదర్శిలో ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి.. ఈ కేసులో అవకతవకలు జరిగినట్లు పిటిషన్ వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ చివరికి ఇరుక్కునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
https://www.youtube.com/watch?v=vxua2ha8pPE