Baby Twist : తమిళనాడులోని రామలింగం అలియాస్ రమేష్ అనే వ్యక్తికి రంజిత అనే భార్య ఉంది. రమేష్ రంజితలకు ఇద్దరు పిల్లలు. వీరి వైవాహిక జీవితం పనేలు బాగానే జరిగింది. రమేష్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న సమయంలో ఇందుమతి అనే మహిళ పరిచయమైంది. పైగా అదే కాలనీలో ఉంటుంది. కొన్నాళ్లకు వారి పరిచయం కాస్త అక్రమ సంబంధం గా మారింది. దాంతో ఇందుమతిని కూడా తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. ఇక రంజిత , ఇందుమతి ఇద్దరు సఖ్యత గానే ఉంటున్నారు. రమేష్ ఏ సినిమాకు వెళ్లినా కూడా ఇద్దరి భార్యలను తన వెంట తీసుకొని వెళ్లేవాడు.
ఇక ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేస్తున్నా రమేష్ కి ధనలక్ష్మి అనే ఆవిడ మీద కన్ను పడింది. ధనలక్ష్మి కి మంత్ర శక్తులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. రమేష్ కి మాత్రం ఆమె అందం నచ్చింది. ఇక పెళ్లి చేసుకోకుండానే ఇంటికి తీసుకువచ్చి ఆమెతో కాపురం పెట్టేసాడు. అయితే వీళ్ళందరికీ సమస్యలు రాకపోవడానికి కారణం డబ్బు రమేష్ బాగా సంపాదించేవాడు. ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. రమేష్ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా రెండో భార్య ఇందుమతితోనే గడిపేవాడు. దాంతో ధనలక్ష్మి రంజిత ఇద్దరు దగ్గరయ్యారు. వీరిద్దరూ బట్టలు లేకుండా కూడా ఏకాంతంగా దగ్గరయ్యారు. రంజిత ధనలక్ష్మి ఓ ముహూర్తం చూసుకొని ఇంట్లో పెళ్ళి కూడా చేసేసుకున్నారు. అంటే ధనలక్ష్మి రంజిత ఇద్దరూ భార్య భర్తలు అన్నమాట.
ధనలక్ష్మికి వశీకరణ విద్య వచ్చని అంతా అనుకుంటారు. ఇక రంజిత ధనలక్ష్మి ఇద్దరూ బట్టలు లేకుండా చేసే పూజలు చూసి ఆమె పిల్లలు ఇద్దరు గజగజ వనికిపోయేవారు. వాళ్ళని బడికి పంపించక పోగా ఇంట్లో పని చేయించే వాళ్ళు.. ఆ పని చేయకపోతే వాళ్లకి పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళు . దాంతో రంజిత పెద్ద కొడుకు వాళ్ళ అమ్మమ్మకి ఉన్న విషయాన్ని చెప్పాడు అసలు పిల్లల్ని తనతో పాటే తీసుకు వెళ్తానని వాళ్ళ అమ్మమ్మ అడగగా అందరూ తిట్టి తరిమేశారు. ఒకరోజు ధనలక్ష్మి రంజితతో నీ చిన్న కూతురుని దేవుడికి బలిస్తే మనకు చాలా శక్తులు వస్తాయని మాట్లాడుకుంటున్న మాటలను రంజిత పెద్ద కొడుకు వింటాడు ఇక వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఉన్న విషయాన్ని చెబుతాడు.
ఆమె హుటాహుటిన వచ్చి వాళ్ళిద్దర్నీ తీసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు వస్తారని తెలుసుకున్న రమేష్ వాళ్ళు ఊరు నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి పోలీసులు వాళ్లని పట్టుకొని కేసు విచారిస్తున్నారు.