Ram Charan: నా జీవితంలో ఇవే చాలా అద్భుతమైన క్షణాలు.. రామ్ చరణ్..!

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ లాస్ ఏంజిల్స్ లో ఈ నెల 12వ తేదీన జరగబోయే 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనబోతున్నారు. ఇటీవలే అమెరికాలో గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షో తో పాటు ఏబిసి న్యూస్ వాళ్ళు నిర్వహించిన ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్ లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి పాపులర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ KTLA రామ్ చరణ్ ను ఇంటర్వ్యూ చేసింది.

Ram Charan reacts as he is called 'Brad Pitt of India' on his latest  appearance at American Talk Show | PINKVILLA

ఇంటర్వ్యూలో భాగంగా నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు అంతర్జాతీయ అవార్డ్ లు రావడం.. ఆస్కార్ కి ఎంపిక కావడం మీకు ఎలా అనిపిస్తోంది? అని అడగగా.. దానికి రామ్ చరణ్ బదిలీస్తూ..” నా జీవితంలో ఇవి అద్భుతమైన క్షణాలు ..ఆస్కార్ వేడుకలలో నేను ఒక అతిధిగా ఉండాలని అనుకున్నాను.. ఇప్పుడు నామినేట్ అయ్యాను.. నేను ఆ బ్లాక్ లేడీ ని మా టీం తో కలిసి మా దేశానికి తీసుకెళ్లడానికి చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నాను.. మార్చి మూడవ తేదీన మా సినిమా యుఎస్ లో రీ రిలీస్ అవుతోంది.. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని నిరాశ పరచదని భావిస్తున్నాను” అంటూ రాంచరణ్ తెలిపాడు.