Rajitha Anish : పెళ్లంటేనే ప్రతి అమ్మాయికి కొన్ని ఆశలు కలలు కోరికలు ఉంటాయి.. రజిత కూడా తన పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకుంది.. పెళ్లికూతురుగా ముస్తాబయి సంబరపడిపోవాలని అనుకుంది కానీ.. అనీష్ ను ప్రేమించిన రజిత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనీష్ కుటుంబంలో రజితను ఆహ్వానించిన రజిత కుటుంబంలో మాత్రం మీ పెళ్లి మేము చేయము కట్టుబట్టలతో రజితను తీసుకొని వెళ్ళిపోమని అనిష్కు చెప్పగా ఇక వాళ్ల పెళ్లి సాదాసీదాగా జరిగింది..

వరుడు అనీష్ బంధువులు, స్నేహితుల సమక్షంలో చాలా సాధారణంగా డిసెంబర్ 29 2014 లో వివాహం చేసుకున్నారు. అనీష్ కి ఓ ప్రైవేట్ ఉద్యోగి.. తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రజితను ఉన్నత చదువులు చదివించాడు. భర్త ఆసరాతో రజిత కామర్స్ లో పీహెచ్డీ చదువులు పూర్తి చేసింది. ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అనీష్, భార్యలో ఏదో అసంతృప్తి కల్పిస్తున్నట్లు గమనించాడు. ఏదైనా పెళ్లి వేడుకలో పాల్గొన్న భార్య మొహంలో ఒక చింత కనిపించేది అనీష్ కి. తమ పెళ్లి అంత సాదాసీదాగా జరిగిపోవడం విధిరాత అని అనుకుంటూ ఉండేది. రజిత కి వధువుగా అలంకరించుకోవాలి అనే కోరిక ఉండేది. వారి పెళ్లి రోజున తీసిన ఫోటోలు వీడియోలులో రజిత అన్నిటిలోనూ విచారంగానే కనిపించింది. ఇది చూసిన అనీష్ కు ఎంతో బాధగా అనిపించి తమ 8వ పెళ్లి రోజును వారే ఎప్పటికీ మర్చిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు.. తమ 7 ఏళ్ల కుమార్తె అమ్ము సాక్షిగా పెళ్లినాటి ప్రమాణాలు చేస్తూ వెడ్డింగ్ ఫోటోషూట్ ను ఏర్పాటు చేశారు. అనీష్ రజిత వధూవరులుగా ముస్తాబయ్యారు. అట్టుకల్ దేవాలయం, శంకుముఖం బీచ్ తో సహా అనేక ప్రదేశాలలో ఫోటోషూట్ జరిగింది. ఈ ఫోటోలు డిజిటల్ ఆల్బమ్ గా మారింది. ఈ సారి ఫోటోలో ప్రత్యేకత ఏంటంటే రజిత ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. భార్య కలను నెరవేర్చిన ఈ భర్త ఎంత గొప్పవాడో కదా అని నేటిజెన్లు మెచ్చుకుంటున్నారు. భార్య మనసు అర్థం చేసుకొని నడుచుకునే వాడే నిజమైన భర్త అంటూ ఈ జంటని పొగిడేస్తున్నారు నేటిజన్స్. ఇకనుంచి రజిత ముఖంలో ఇలాంటి చిరునవ్వే ప్రతిరోజు ఉండాలని అంతా ఆశీర్వదిస్తున్నారు.