Oscar : RRR ఆస్కార్ కి పంపాల్సిందే .. మోడీ తో రాజమౌళి స్పెషల్ అపాయింట్మెంట్ ??

Oscar :  ప్ర‌తి టెక్నీషియ‌న్‌కి ఆస్కార్ అందుకోవ‌డం ఒక క‌ల‌. హాలీవుడ్ స్టార్స్ ఇప్ప‌టికీ ఎన్నో సార్లు ఆస్కార్‌ని అందుకోగా, తెలుగు భాష నుండి ఇంత వ‌ర‌కు ఒక్కరు కూడా ఆస్కార్ అందుకోలేదు. అయితే ఈ సారి ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకోవ‌డం గ్యారెంటీ అని అంద‌రు అనుకున్నారు. కాని  ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్‌కు నిరాశ తప్పలేదు. డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వెయ్యి కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన ఈ చిత్రం ఆస్కార్ కి ఎంపిక కాక‌పోవ‌డంపై అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Oscar : మోడీతో భేటి..!

భారత్ తరుపున ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంపిక కాకపోవడంపై ఆర్ఆర్ఆర్  బృందం స్పందించింది. RRR US డిస్ట్రిబ్యూటర్, వేరియన్స్ ఫిల్మ్స్, ఈ చిత్రాన్ని అన్ని కేటగిరిస్‌లోనూ పరిగణించాలని 95 ఆస్కార్ అకాడమీ జ్యూరీ సభ్యులను అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రాన్నిఆస్కార్‌కి తీసుకెళ్లేందుకు రాజ‌మౌళి.. మోడీతో అపాయింట్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు జ‌రుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని ఈ న్యూస్ తెగ వైర‌ల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో ఆస్కార్‌కి  ఎంపికైంది.   ఈ చిత్రానికి పాన్ నలిన్ దర్శకత్వం వహించాడు.

Oscar rajamouli takes special appointment of modi
Oscar rajamouli takes special appointment of modi

చిత్రాన్ని రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. జుగాడ్ మోషన్ పిక్చర్స్, మాన్సూన్ ఫిల్మ్స్, ఛెల్లో షో ఎల్ఎల్పీ, మార్క్ దువాలే సైతం నిర్మాణంలో భాగమయ్యారు. గుజరాత్‌లోని ఓ మూరుమూల పల్లెటూరులో జరిగే కథతో తెరకెక్కిన చిత్రమే ‘ఛెల్లో షో’. గుజరాత్‌లోని చలాలా అనే పల్లెటూర్లో పుట్టిపెరిగిన తొమ్మిదేళ్ల సమయ్‌ అనే కుర్రాడికి థియేటర్‌ ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌తో పరిచయం ఏర్పడ‌గా, ఆ ప‌రిచ‌యం తోనే తరచూ ప్రొజెక్షన్‌ గదిలోకి వెళుతుంటాడు. ప్రొజెక్టర్‌ నుంచి వచ్చే కాంతి తెరపై బొమ్మగా మారడం అతినికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.ఈ క్ర‌మంలో సినిమాని ప్రేమిస్తాడు. అదే అతడి జీవితంలో  ప‌లు మార్పులు తీసుకు వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ఛెల్లో షో రూపొందింది.