Rajamouli : ఎవ్వరికీ నచ్చని పని చేసిన రాజమౌళి .. వీరాభిమానులు కూడా ఇదేంట్రా అనుకుంటున్నారు !

Rajamouli : ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజమౌళి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న అప‌జ‌యం అనేది ఎరుగకుండా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. బాహుబలి సినిమాతోనే మన తెలుగు చిత్రపరిశ్రమ స్థాయిని పెంచాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మ‌న సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లి ప్రపంచం నలుమూలలా గొప్పతనాన్ని చాటాడు. ఇప్పుడు రాజ‌మౌళి హాలీవుడ్ లో కూడా బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రాజమౌళి హాలీవుడ్ లో జరుగుతున్న ఓ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో ఓ సినిమా ప్లాన్ చేస్తుండ‌గా, దీనికి సంబంధించిన ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు.

Rajamouli : మార‌వా రాజ‌మౌళి..

చూస్తుంటే రాజ‌మౌళి బాలీవుడ్‌, హాలీవుడ్ స్టార్స్‌తో కూడా సినిమా చేయ‌బోతున్నాడ‌ని కొంద‌రు అయితే ప్ర‌చారాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో భాగం గా రాజమౌళి గురించిన ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపడింది. రాజ‌మౌళితో స‌న్నిహితంగా ఉండే వ్య‌క్తుల‌కి ఆయ‌న నాస్తికుడ‌ని తెలిసింది నువ్వు నాస్తికుడి గా కాకుండా ఉంటే బాగుంటుంది రాజమౌళి అని అన్నార‌ట‌. కానీ రాజమౌళి మొండి వాడు తాను పట్టిన కుందేలు కు మూడే కాళ్లు అనే టైప్ .. కాబ‌ట్టి ఆయ‌న మారే అవ‌కాశ‌మే లేద‌ని కొంద‌రు అంటున్నారు.

rajamouli doesnt change his policy
rajamouli doesnt change his policy

ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రాజమౌళి ఓ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లోబ్ట్రోటింగ్ ఆధారంగా రానుందని చెప్పారు. ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌తో షూట్ చేయనున్నారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్‌లో మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్’‌లో కూడా షూటింగ్ చేస్తారట. ఇక మిగితా భాషాల్లో డబ్ చేస్తారట. ఈ చిత్రంతో రాజ‌మౌళి క్రేజ్ మ‌రింత పీక్స్ కి వెళ్ల‌డం ఖాయం అంటున్నారు.