Raghu Rama Krishna Raju : వైసిపి తిరుగుబాటు రఘురామకృష్ణంరాజు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని సర్వే నిర్వహించగా.. ఆ సర్వేపై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి..! ఒకప్పుడు వైసిపికి రెండు సీట్లు కూడా రావన్న ఈ ఎంపీ ఇప్పుడు ఏకంగా ఇన్ని సీట్లు వస్తాయి అని అనడంతో.. తన సర్వేపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా స్పందిస్తున్నారు.. 2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందో రాదో ఎవరు చెప్పలేకపోతున్నారు.. అందుకే సర్వే చేయించి టిడిపిది అధికారం గ్యారంటీ అని చెప్పే ప్రయత్నం చేశారు రఘురామకృష్ణ..
ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్ ద్వారా జూన్, జూలైలో సర్వే చేయించారట ఈ సర్వే ప్రకారం టిడిపికి గ్యారెంటీగా 54 సీట్లు వస్తాయట.. అంతేకాకుండా మరో 39 సీట్లలో గెలిచే అవకాశం ఉందట అంటే.. మొత్తానికి టిడిపి 93 సీట్లు గెలిచి అవకాశం ఉందని తేల్చారు. అలాగే వైసిపి కచ్చితంగా 12 సీట్లు గెలుస్తుందని ఇక రెండు పార్టీల మధ్య 68 సీట్లు మధ్య గట్టి పోరు జరుగుతుందని.. ఒకవేళ వైసీపీ 68 సీట్లు గెలుచుకున్న కూడా కేవలం 80 సీట్లు మాత్రమే వస్తాయి. ఎటు చూసినా టిడిపిదే పై చేయి.. మొత్తంగా మిగిలినవి కేవలం రెండు సీట్లు మాత్రమే.. ఇక ఆ రెండు సీట్లు జనసేన గెలుస్తుందా.. టిడిపికా వైసీపీకా అని తేల్చి చెప్పలేదు..
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఒక్కప్పుడు రఘురామకృష్ణంరాజు వైసిపి 15 సీట్ల కన్నా గెలవలేదని చెప్పారు.. కానీ ఇప్పుడు 80 సీట్లలో గెలుస్తుందని అంటున్నారు.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పిన రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్టో తేల్చుకోలేక జుట్టు పీక్కుంటున్నారు. మిగతావారు కనీసం తన సర్వే తనకైనా అర్థమైందా లేదంటే ఏదో ఉజ్జయింపుగా చెప్పాడా అని మరికొంతమంది అనుకుంటున్నారు.. రఘురామ ఎలాగైనా టిడిపి గెలిపించాలని.. జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపుతో పుట్టుకొచ్చింది.. ఈ సర్వే అని మరి కొంతమంది అంటున్నారు..