Puspa -2 డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక నటించింది. అనసూయ సునీల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా సీక్వెల్ పనుల్లో అల్లు అర్జున్ సుకుమార్ బిజీగా ఉన్నారు. మొదటి పార్ట్ సక్సెస్ కావడంతో సెకండ్ పార్ట్ పైన కూడా దృష్టి పెట్టి మరింత అద్భుతంగా తెరకెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పార్ట్ 2 షూటింగ్లో అల్లు అర్జున్ బన్నీ చాలా బిజీగా ఉన్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతుంది రెండో పార్ట్ లో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కథ , పాత్ర నచ్చితే గాని సినిమాలు అంగీకరించని సాయి పల్లవి.. ఒప్పుకున్నదంటే ఈమె కీలకమైన పాత్ర నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.