Mahesh Babu దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆల్రెడీ మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో జరగబోయే ఎన్నికలలో విజయం సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నేతలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కాంగ్రెస్ పార్టీ బిగ్ లీడర్ ప్రియాంక గాంధీ షాక్ ఇచ్చినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెరలు కొడుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ మద్దతు తెలపడం తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా కూడా కృష్ణ పోటీ చేయడం జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో ఘట్టమనేని కుటుంబం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అప్పట్లో నిలిచింది. ఈ క్రమంలో త్వరలో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబుతో ప్రత్యేకంగా మంతనాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో మద్దతు తెలపాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని.. కోరినట్లు టాక్. అయితే తాను రాజకీయాలకు ఇంకా ఎన్నికల ప్రచారాలకి చాలా దూరమని ప్రియాంక గాంధీ రిక్వెస్ట్ నీ సున్నితంగా మహేష్ బాబు తృణీకరించినట్లు సమాచారం. అంతేకాదు సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలోనే రాజమౌళి సినిమా మొదలుకానిందని అలాంటి బిగ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న క్రమంలో వేరే విషయాల వైపు తన దృష్టి ఉండదని నిర్మొహమాటంగా ప్రియాంక గాంధీకి మహేష్ బాబు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.