Praveen: ప్రవీణ్ అనే అతను ఓ వితంతువును పెళ్లి చేసుకున్నాడు. ఇది ఆమె మీది ఉన్న ఔదార్యం తో పెళ్ళి చేసుకున్నాడు లేడో ఇది చివరవరకు చదివితే మీకే అర్థమవుతుంది.. ఆమెకు 17 ఏళ్ల వయసుగల కూతురు, ఒక కొడుకు ఉన్నాడు.. ఆ అమ్మాయి హైదరాబాద్ లోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంది దీపావళి సందర్భంగా సెలవులు ఇవ్వడంతో వరంగల్ లోని తన తాత ఇంటికి వచ్చింది..

వరంగల్ జిల్లా కాశిబుగ్గకు చెందిన కోడం ప్రవీణ్ తాత ఇంటికి వచ్చిన తన కూతురు అవుతుందని కూడా ఆలోచించకుండా బెదిరించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అలా ఒక్కసారి కాదు.. పలుమార్లు ఆమెను హింస పెట్టాడు. ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. ఈ ఘటన తర్వాత మళ్లీ హైదరాబాద్ వెళ్ళిన బాలికను తన పుట్టినరోజు సందర్భంగా వరంగల్ కు తీసుకువచ్చి మళ్ళీ లైంగిక దాడికి పాల్పడి ఎవ్వరికీ చెప్పద్దని బెదిరించాడు. హైదరాబాద్ వెళ్ళిన ఆ బాలిక జరిగిన ఘోరాన్ని ఆమె పిన్నికి జరిగిన విషయం చెప్పింది. జరిగిన విషయాన్ని బాలిక తల్లికి చెప్పి గంజి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీస్ అధికారులు దర్యాప్తు చేశారు. ముద్దాయిని న్యాయస్థానంలో నేర ఆరోపణల పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.