Heart attack.. ప్రస్తుతం ఎక్కడ చూసినా వరుస గుండెపోటు మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఒకరి తర్వాత ఒకరు గుండెపోటుతో మరణిస్తూ ఉండగా నేడు ఆంధ్రప్రదేశ్ .. కాకినాడ జిల్లా.. ప్రతిపాడు టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా గుండెపోటుతో మరణించారు. శనివారం రాత్రి ఉన్నట్టుండి ఆయనకు గుండె నొప్పి రావడంతో ఆయనను కాకినాడ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ డాక్టర్లు చికిత్స చేస్తుండగాని ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 47 సంవత్సరాలు.
రాజా హఠాన్మరణంతో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. ఇకపోతే వరుపుల రాజాకి గుండెపోటు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. డాక్టర్లు స్టంట్ వేశారు. అయితే ఆయన గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగని సమస్య ఉంది. అది మరోసారి ఏర్పడడం వల్లే నిన్న రాత్రి 11:20 గంటల సమయంలో ఆయన కన్ను మూసినట్లు వైద్యులు నిర్ధారించారు.