NTR : ఎన్‌టి‌ఆర్ కొత్త హెయిర్ స్టయిల్ తో ఇంటికి వెళ్ళగానే అతని భార్య ప్రణతి ఏమందో తెలుసా ?

NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌ర్క్ విష‌యంలో ఎంత డెడికేటెడ్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాత్ర న‌చ్చితే దాని కోసం ఎంతైన క‌ష్ట‌ప‌డుతుంటారు. ఎన్టీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సార్లు త‌న శ‌రీరాకృతి కూడా మార్చుకున్నారు. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ కోసం చాలా ధృడంగా క‌నిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు డిఫ‌రెంట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. స్టైలిష్‌ క్రాఫ్‌, గడ్డం, గాగుల్స్‌ తో జీన్స్ ట్రౌజర్‌ వేసుకుని కెమెరాకు ఫోజులివ్వ‌గా, ఈ లుక్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తారక్ ఇప్పుడు ఓ ప్రముఖ బ్రాండ్ కోసం కమర్షియల్ యాడ్ చేస్తుండ‌గా, దాని కోస‌మే అతడు ఈ కొత్త లుక్‌తో కనిపిస్తున్నట్టు ప్ర‌చారం న‌డుస్తుంది.

Advertisement
pranathi-happy-with-ntr-new-look
pranathi-happy-with-ntr-new-look

NTR : యంగ్ లుక్..

కమర్షియల్ యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. యాడ్‌లో నటించడం కోసం తారక్ ఏకంగా పది కోట్ల రూపాయలు చార్జ్ చేశాడట. అంతేకాదు, ఈ యాడ్ చేయడం కోసం సదరు సంస్థ భారీగానే ఖర్చు చేసిందని టాక్ కూడా వినిపిస్తుంది.ఏదైతేనేం ఎన్టీఆర్ లుక్ మాత్రం అందరి దృష్టిని ఆక‌ర్షించింది. ఇక బండ్ల గ‌ణేష్ తో పాటు ప‌లువ‌రు ప్ర‌ముఖులు కూడా ఈ లుక్‌పై తమ స్పంద‌న తెలియ‌జేశారు. ఎన్టీఆర్ వైఫ్ ప్ర‌ణ‌తి అయితే ఆ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూసి తెగ మురిసిపోయింద‌ట‌.

Advertisement

చాలా యంగ్ ఏజ్‌లో క‌నిపిస్తున్నావు. కుర్ర హీరోగా మాదిరిగా ఉన్నావు అంటూ భ‌ర్త‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించింద‌ట‌. అంతేకాదు ఇంత అందంగా ఉన్న త‌న భ‌ర్త‌కు ఎక్క‌డ జిష్టి త‌గులుతుందో అని జిష్టి కూడా తీసింద‌ట‌. ఇక ఇప్పటికే రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్.. మరికొందరు దర్శకులతోనూ కథా పరమైన చర్చలు జరుపుతున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇలా ఇప్పటికే ఈ స్టార్ హీరో ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని , అలాగే, వెట్రిమారన్, అట్లీ, త్రివిక్రమ్‌, హను రాఘవపూడిలతోనూ సినిమాలు చేయబోతున్నానే టాక్ న‌డుస్తుంది. త్వ‌ర‌లోనే వీటిపై క్లారిటీ రానుంది.

Advertisement