Prabhu: డార్లింగ్ సినిమా ద్వారా ప్రభాస్ తండ్రిగా నటించి భారీ పాపులారిటీ అందుకున్న ప్రభు తాజాగా అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఆయనను చెన్నైలోని కేలంబాక్కం లో మేడ్వే అనే ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . ప్రభు గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధి సమస్యతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది . యూరేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లో ఆయన త్వరగా కోలుకొని డిస్చార్జ్ కానున్నట్లు సమాచారం.
మరొకవైపు ప్రభు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబాన్ని సినీ ప్రముఖులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభు చివరిసారిగా విజయ్ దళపతి వారసు చిత్రంలో నటించారు. తమిళనాడు తిలకం శివాజీ గణేషన్ తనయుడిగా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన ఈయన 1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షాంగిలి చిత్రంలో హీరోగా కనిపించారు. తొలి సినిమాతోనే నటనపరంగా మెప్పించిన ప్రభు.. తన తండ్రి దర్శకత్వం లో హీరోగా కూడా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం సహాయ నటుడిగా కొనసాగుతున్నారు.