Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో సలార్ కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటుంది.. ఇప్పటికే సుమారు 85 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే తాజాగా ప్రభాస్ సలార్ నుంచి ఓ బిగ్ అప్ డేట్ రానుందని సోషల్ మీడియాలో ఓ ట్యాగ్ వైరల్ అవుతుంది.. అదెంటంటే.!?

సలార్ చిత్ర యూనిట్ ముందుగా ఈ ఏడాదిలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.. కాగా లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. 2023 ఏడాది కాదు సలార్’ (2023 సాల్ నహి, సలార్ హై) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే నిజానికి సలార్ మూవీ కంటే ముందుగానే ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఏడాది ప్రభాస్ సలార్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి రానున్నాడు అని తాజా సమాచారం.. అదే నిజమైతే ప్రభాస్ కచ్చితంగా RRR – KGF – బాహుబలి రికార్డ్ లు బద్దలు కొట్టడం. ఈ సినిమా హైప్ అలా ఉంది.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ప్రభాస్ ను మునుపెన్నడూ చూడని విధంగా చూపించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా ప్రభాస్ ఫేట్ ను మార్చుతుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.