Prabhas : ఇక డౌటే లేదు.. ప్ర‌భాస్‌తో ఈ అమ్మ‌డు పెళ్లికి సిద్ద‌మైన‌ట్టే..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్ పెళ్లి విష‌యం కొన్నాళ్లుగా ఎంత హాట్ టాపిక్‌గా నిలుస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. అనుష్క‌తో అని ఒక‌సారి, చుట్టాల‌మ్మాయితో అని ఒక‌సారి.. ఇలా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఎన్నో ప్ర‌చారాలు సాగాయి. ఇటీవ‌ల కృతి స‌న‌న్‌తో ముడిపెడుతున్నారు. ఆదిపురుష్ చిత్రంలో వీరిద్ద‌రు న‌టించిన‌ప్ప‌టి నుండి ప్ర‌చారాలు ఎక్కువ‌య్యాయి. అయితే తాజాగా కృతి స‌న‌న్‌.. ప్ర‌భాస్ గురించి నోరు విప్ప‌డంతో త్వ‌ర‌లో వీరిద్ద‌రు పెళ్లి చేసుకోవ‌డం ఖాయ‌మ‌న్న‌ట్టు కొత్త ప్ర‌చారాలు మొద‌లు పెట్టారు.

prabhas-marriage-news-viral
prabhas-marriage-news-viral

ఇద్ద‌రి మ‌ద్య ఏం న‌డుస్తుంది..

వరుణ్ ధావన్ హీరోగా కృతి సనన్ హీరోయిన్‌గా, అమర్ కౌశిక్ దర్శకత్వంలో తోడేలు అనే చిత్రం రూపొంద‌గా, చిత్రం నవంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తెలుగులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను హైదరాబాదులో నిర్వహించ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో కృతి సనన్ మాట్లాడుతూ.. నేనొక్కడినే సినిమా స‌మ‌యంలో మహేష్ బాబు నాకు ఎంతో సహకరించారు. ఆయన మంచి వ్యక్తి , ఇక నేను చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు తోడేలు చిత్రంతో తెలుగువారిని అలరించేందుకు రెడీ అయ్యాను అని చెప్పుకొచ్చింది.

ఇక ఈవెంట్ కి వ‌చ్చిన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెబుతూ తెలుగులో తన ఆదిపురుష్ కో స్టార్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్ థింగ్ ఉంద‌ని జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. ఆదిపురుష్‌ టీజర్ లాంచ్ ఈవెంట్లో చాలా చోట్ల ప్రభాస్ కృతి సనన్ చూపులు అంద‌రికి కాస్త తేడాగానే అనిపించాయి. జ్యోతి ప్రజ్వలన చేసే సమయంలోనే కృతి చూపులు, చేష్టలు వింతగా అనిపించాయి.. ప్రభాస్ తన చెప్పులు విడిచి.. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు లేటుగా వ‌చ్చే స‌మ‌యంలో ప్రభాస్‌ను త్వరగా రమ్మన్నట్టుగా కృతి పిలుస్తుంది. ఇక చెమ‌ట‌లు ప‌డుతుంటే త‌న కొంగుని ఇవ్వ‌డం ఇవ‌న్నీ చూసి అభిమానులు ఏవేవో ఊహించేసుకుంటున్నారు.