Walt Disney: ఎంటర్‌టైన్‌మెంట్ లెజెండ్ సంస్థ, వాల్ట్ డిస్నీ స్టూడియోస్.. ఈ అమెరికన్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ మన టాలీవుడ్ స్టార్స్ తో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు లాంచ్ చేయనున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఈ న్యూస్ కచ్చితంగా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. సినీ ప్రేక్షకులంతా విజిల్ వేసే న్యూస్.
ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుడి సత్తా ఏంటో బాహుబలి సిరీస్ తో ప్రపంచానికి చాటి చెప్పాడు. ప్రభాస్ టాలీవుడ్ లో కొత్త అధ్యాయాన్ని రాశారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. జక్కన్న అదే రేంజ్ లో ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు..
ఇప్పుడు ప్రస్తుతం అంతా పాన్ ఇండియా సినిమాల హవానే నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ హీరోలు ఇంటర్నేషనల్ లో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలతో వాళ్ళ రేంజ్ పెయిన్ చేసుకున్నారు. ప్రస్తుతం మల్టీస్టార ట్రెండ్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ తో మరోసారి అది ప్రూవ్ అయింది. ఓ ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలను తీసుకొని వాల్ట్ డిస్నీ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు స్టార్ట్ చేయనుంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్..
ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ కలిపి వాటి ల్లో ఓ ఇంటర్నేషనల్ సినిమా ను రూపొందించాలని అనుకుంటున్నారట. ఇక ప్రభాస్ తారక్ ఇద్దరి రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అయిందట ఒక్కొక్కరికి 120 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట .ఇక ఇంటర్నేషనల్ సినిమా కావడంతో ప్రభాస్, తారక్ ఇద్దరు ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే కనుక ఇంటర్నేషనల్ సినిమాతో వీరిద్దరిస్తాయి ఎక్కడికి వెళ్తుందో చెప్పనక్కర్లేదు .ఊహకే వీళ్లిద్దరి సినిమా ఇంత ఆనందాన్ని కలిగిస్తే నిజమైతే ఇంకెంత బాగుంటుందో కదా.. వాల్ట్ డిస్నీ ఇంటర్నేషనల్ సినిమాలో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.