Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం సలార్.. ఈ సినిమా ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ జాబితాలో ట్రెండింగులో ఉంది.. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ సలార్ గురించి గుండె బడ్డలయ్యే బ్రేకింగ్ న్యూస్ చెబుతారని.. ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ సినిమా షూటింగ్ అరుదైన లొకేషన్లలో భారీ సెట్లలో.. మునుపెన్నడూ ఇండియన్ సినిమా హిస్టరీలో లేనంత కొత్తగా ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతున్నాయి. ప్రశాంత్ నీల్ సలార్ క్లైమాక్స్ ఫైట్ తో పాటు సినిమాలో ఆరు భారీ యాక్షన్ ఎపిసోడ్ లను ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది.
గోదావరిఖనిలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించారు.. భారీ యాక్షన్ దృశ్యాల కోసం పాపులర్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ని బరిలోకి దింపారు.. ఇక ప్రభాస్ శ్రుతిహాసన్ సీన్స్ ట్రాజిక్ గా ఎంతో ఎమోషన్ ని నింపుతాయి అని టాక్. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పాన్ వరల్డ్ కి రీచ్ అవ్వాలన్నది కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పంతం. కాగా ప్రభాస్ మాస్ కటౌట్ ని ఒక రేంజులో ఉపయోగించు కున్నాడని సమాచారం.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో రాఖీ భాయ్ ని మించిన కరిష్మాతో ప్రభాస్ అలరించనున్నాడు.
అయితే ప్రభాస్ ను ఏ రేంజ్ లో పిండేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఫుల్ గా వడేసాడట.. ప్రభాస్ లో నుంచి అవుట్ పుట్ తీయడం కోసం ఇలా చేసినా.. ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఇది ఒళ్లుమండే బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. మరి ఇంతలా ప్రభాస్ ను ఏ డైరెక్టర్ వడలేదట. ఇది చాలదన్నట్టు 2023 సెప్టెంబర్ 28న యథాతథంగా సలార్ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఆ మేరకు సైమల్టేనియస్ గా నిర్మాణానంతర పనుల్ని సాగిస్తున్నారని తెలిసింది.