YCP MLA : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నా కుటుంబ సభ్యులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఫ్యామిలిని తాగుబోతు కుటుంబం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఆదివారం తాడేపల్లిలో ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ.. ఆయన పేరు నారా చంద్రబాబు కాదు అని సారా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు పైకి చేసేది పాల వ్యాపారమునీ.. కానీ తరవాత నడిపేది సారా పరిశ్రమని ఎమ్మెల్సీ సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
చంద్రబాబు భార్య భువనేశ్వరి వాళ్ళ కోడలు బ్రాహ్మణి మద్యం ద్వారా రోజుకి కోటి రూపాయలు ఆదాయం అనుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు బి త్రీ బ్రాండ్లు అంటే భువనేశ్వరి బ్రాహ్మణి బాబు అని అర్థమని ఆమె అన్నారు ఇక ఆయన కుమారుడు నారా లోకేష్ ను కూడా ఆమె వదలలేదు.. లోకేష్ కు మందు, మగువా లేనిదే నిద్ర పట్టదని సంచలన వ్యాఖ్యలు చేశారు.. టోటల్గా బాబు కుటుంబం తాగుబోతు ఫ్యామిలీ అని దుయ్యబట్టారు..
చంద్రబాబు హయాంలోనే డిస్టీలరీలు , బ్రువరి లన్నింటిని లైసెన్సులు ఇచ్చారని.. 2004 బ్రాండ్లను చంద్రబాబువి తీసుకువచ్చారని ప్రజలను తాగుబోతులుగా మార్చి కోట్ల ఆదాయం పొందారని.. మద్యం చుక్క లేకపోతే చంద్రబాబు లోకేష్ ఒక్క మాట కూడా మాట్లాడారు అని.. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరని.. చంద్రబాబు పాలనంత దాచుకోవడం, పంచుకోవడం, తినడమే అని ఆమె అన్నారు. ఆయనకు పులివెందుల గురించి మాట్లాడే అర్హత లేదు అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు..