Poorna : అయ్య బాబోయ్.. పూర్ణ భ‌ర్త మోసాలు చేస్తున్నాడా.. ఈ అమ్మ‌డి రియాక్ష‌న్ ఏంటి?

Poorna: అవును సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ పూర్ణ‌. ఈమె ఇటీవ‌ల యూఏఈలోని పెద్ద బిజినెస్ మ్యాన్ లలో ఒక‌రైన షానిద్ అసీఫ్ అలీని పెళ్లి చేసుకుంది . ప్రస్తుతం అతను అక్కడ పలు వ్యాపారాలు నిర్వహిస్తుండ‌గా, ఆయ‌న కంపెనీ ద్వారా దుబాయ్ ప్రభుత్వం పలువురు భారతీయ నటీనటులకు గోల్డెన్ వీసాలు అందిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా షానీద్ కు చెందిన కంపెనీ ద్వారానే ఇప్పుడు విక్రమ్ కు గోల్డెన్ వీసా వచ్చిందని తెలుస్తుంది.ఇందుకు సంబంధించిన ఫొటో కూడా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అంత‌కు ముందుకు వీరు ప్ర‌భుదేవికి గోల్డెన్ వీసా అందించారు.

Advertisement
poorna-social-media-post-viral
poorna-social-media-post-viral

Poorna : అప్ర‌మ‌త్తం చేసిన పూర్ణ‌

ఇక ఇదిలా ఉంటే పెళ్లి త‌ర్వాత పూర్ణ త‌న భ‌ర్త‌కు సంబంధించిన బిజినెస్‌ని తెగ ప్ర‌మోట్ చేస్తుంది. ఈ క్ర‌మంలో తన భర్త పేరుతో జరుగుతున్న సైబర్ మోసానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. +971 52 724 5366 ఫోన్ నంబరు కలిగిన వాట్సాప్ అకౌంట్ ద్వారా తన భర్త షానిద్ పేరుతో ఒకరు ఆన్‌లైన్ మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు తన దృష్టికి వచ్చిందని.. అది తన భర్త కాదని.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పూర్ణ తన పోస్ట్‌లో పేర్కొంది.. ఈ ప్రొఫైల్‌తో మీరు ఏవైనా లావాదేవీలు జరిపితే దానికి తన భర్త ఎట్టిపరిస్థితుల్లో బాధ్యుడు కాదనికూడా ఆ పోస్ట్‌లో పేర్కొంది.

Advertisement

పూర్ణ భర్త షానిద్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూఏఈలో పలు లావాదేవీలు నిర్వహిస్తోండ‌గా, దుబాయ్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులను ఈ కంపెనీ తన వినియోగదారులకు అందిస్తూ వ‌స్తుంది. గ‌తంలోచాలా మంది సెల‌బ్రిటీల‌కు ఈ కంపెనీ నుండి వీసాలు లభించాయి. కమల్ హాసన్ – మోహన్ లాల్ – మమ్ముట్టి – షారుక్ ఖాన్ – త్రిష – కాజల్ అగర్వాల్ – ఉపాసన కొణిదెల – సుకుమార్ వంటి ప్రమఖులు ఈ కంపెనీ నుండే వీసాల‌ని అందుకున్నారు.

Advertisement