Poorna: పూర్ణ పరిచయం అక్కర్లేని పేరు.. దశాబ్దానికి పైగా తెలుగు తమిళ మలయాళం సినిమాల్లో పూర్ణ నటించింది.. దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మెన్ ఆసిఫ్ అలీని ఈ ఏడాది జూన్‌లో పూర్ణ వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఇద్దరూ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా తాను ప్రగ్నెంట్ అంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకి పూర్ణ తెలియజేసింది.. తాజాగా పూర్ణ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది..

అదేంటంటే ఇష్టమే కానీ ప్రేమ లేదంట అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ను చూడమని రిక్వెస్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ శేఖర్ మాస్టర్ దర్శకత్వంలో శేఖర్ స్టూడియోస్ రిలీజ్ చేశారు.. ఇది ప్యూర్ లవ్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో అఖిల్ రాజా మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. మొత్తానికి ఇష్టమే కానీ ప్రేమ లేదంట వెబ్ సిరీస్ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది..