బాలకృష్ణ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు.. రంగంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్…

నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్‌లో అడుగు అడుగునా వైసీపీ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏపీలో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య బాబు టీడీపీ పార్టీ తరఫున ప్రచారం ముమ్మరం చేశారు. అయితే వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా బాలకృష్ణను అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. వైసీపీ నాయకులు మాత్రమే కాదు పోలీసులు కూడా బాలకృష్ణను అడ్డుకుంటూ అతని ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే తన బాబాయ్ బాలకృష్ణకు ఎదురవుతున్న ఇబ్బందులను చూసి జూనియర్ ఎన్టీఆర్ బాగా బాధపడుతున్నాడట.

సోషల్ మీడియా ప్రకారం, ఇటీవల బాలకృష్ణ కారుపై వైసీపీ మద్దతుదారులు రాళ్ల దాడి చేశారు. ఈ సంగతి తెలిసి జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ వర్గాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన బాబాయి పై మళ్లీ ఇలాంటి దాడి చేస్తే ఒక్కొక్కడిని రోడ్డుపై ఉరికిచ్చి కొడతానని కూడా అన్నాడు. అయితే ఈ అవమానం తర్వాత బాలకృష్ణకి మరొక అవమానం ఎదురయింది. ఇటీవల బాలకృష్ణ కాన్వాయ్ వెళ్తుండగా పోలీసులు నడిరోడ్డుపై నిలిపివేశారట. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్‌కు తెలియడంతో కారులో అక్కడికి చాలా వేగంగా చేరుకున్నాడట. అంతేకాదు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగినట్లు సమాచారం.

తన బాబాయిని ఆపడానికి మీకెంత ధైర్యం అంటూ తారక్ పోలీసులను నడిరోడ్డుపై నిలదీసినట్లు తెలుస్తోంది. తన బాబాయ్ ని కారు ఆపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని కూడా క్వశ్చన్ చేసినట్టు సమాచారం. అయితే రాళ్ల దాడి జరిగినప్పుడు మాత్రమే కాక ఇప్పుడు కూడా తనకు అండగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను చూసి బాలకృష్ణ చాలా ఎమోషనల్ అయ్యాడట. అంతేకాదు తారక్ ని దగ్గరికి తీసుకొని వైసీపీ నాయకులైనా పోలీసులైనా తనకేం భయం లేదని, నువ్వు వెళ్లి సినిమాలో హాయిగా చేసుకోపో అంటూ జూనియర్ ఎన్టీఆర్ కి బాలకృష్ణ నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.