Poco M5 Phone : పోకో కంపెనీ తాజాగా పోకో M5 స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ మొదటి వారంలో భారత దేశంలో విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ పై అంచనాలను భారీగా సృష్టించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం . ఇక పోకో విడుదల చేసిన Poco M5 స్మార్ట్ ఫోన్ 6.58 అంగుళాల పూర్తి హెచ్డి ని కలిగి ఉంటుంది. 1080 X2400 పిక్సెల్స్ రెజల్యూషన్ స్క్రీన్ ను కూడా కలిగి ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. ఇక గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉన్నట్లు నివేదించబడింది. మీడియా టెక్ Helio G99 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
ఇక ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. 6GB ర్యామ్ అలాగే 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. అంతేకాకుండా మెమొరీ కార్డు ద్వారా స్టోరేజ్ సామర్ధ్యాన్ని 512 GB వరకు పొడిగించుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.. మెయిన్ కెమెరా లో 50 మెగా పిక్సెల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ సెన్సార్ తో పాటు 2వ కెమెరా 2 మెగా పిక్సెల్ సెన్సార్లు కలిగి ఉంటుంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నట్లు సమాచారం.
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎం.ఏ.హెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.15,000 లోపు మాత్రమే.. ఇక ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ మొదటి వారంలో భారత్లో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే 4G , Volte, బ్లూటూత్ వి 5.0 , Wifi, USB -C V2.0 , IR బ్లాస్టర్ ఉన్నాయి. మొత్తానికైతే ఇన్ని అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ఫోన్ కేవలం రూ.15 వేల లోపల లభించడం గమనార్హం. ఇకపోతే మీరు కూడా ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవాలి అంటే.. అతి త్వరలోనే ప్రీ బుకింగ్ సేల్ కూడా నిర్వహించబోతున్నారు. ఇక మీరు ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ త్వరలోనే కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.