Poco M5 Smart Phone : తాజాగా పోకో కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదలకు సిద్ధం అయ్యింది . ఇకపోతే ఈ రోజు నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో భాగంగా ముందే ఆఫర్ కి రాబోతోంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ గురించి చదివి తెలుసుకుందాం.. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో నుంచి ఇటీవల ఇండియాకు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది. అదే పోకో M5.. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన కంపెనీ ఇండియాలో కూడా ఈ ఫోను లాంచ్ చేసింది. రూ. 15 వేల లోపు బడ్జెట్లో పోటీ ఇవ్వడానికి సిద్ధమయింది ఈ స్మార్ట్ ఫోన్. ఇకపోతే ఈ సెగ్మెంట్లో ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిపై ధరలు తగ్గించినట్లు సమాచారం.
పోకో M5 స్మార్ట్ ఫోన్లో ఇటీవల రిలీజ్ అయిన మీడియా టెక్ హీలియో G99 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. సెప్టెంబర్ 13 మధ్యాహ్నం 1:00 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి వచ్చింది. ఇక ఇందులో కలర్స్ విషయానికి వస్తే ఎల్లో, ఐసి బ్లూ, పవర్ బ్లాక్ కలర్స్ లో మీరు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ పై లభిస్తాయి. పోకో M5 స్మార్ట్ ఫోన్ మీకు 2 వేరియంట్ లలో లభిస్తోంది. అందులో ఒకటి 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499.. 6GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఇక ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు అలాగే డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ముఖ్యంగా బేస్ మోడల్ ను రూ.10,999 కే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే రూ.1500 తగ్గింపు రెండు మోడల్స్ పై కూడా మీకు లభిస్తాయి. 90Hz రిఫ్రెష్ రేటుతో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక MIUI 13, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ని కూడా పొందవచ్చు. ఇక బాక్స్లో మీకు 22.5 W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మైక్రో సెన్సార్లతో ఉంటుంది. సెల్ఫీ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.