PM Kisan: మొత్తం దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. పీఎం కిసాన్ 13వ విడత డబ్బుల కోసం ఎదురుచూపులకు తెరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటకలోని బెలగావిలో 13వ విడత డబ్బులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2000 రూపాయలు జమయ్యాయి. మొత్తంగా రూ.16,800 కోట్లు విడుదల చేయగా.. మొత్తం రైతుల ఖాతాల్లోకి గత కొద్ది నిమిషాల క్రితం జమ అయ్యాయి.
అయితే మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే..pmkisan.gov.in అనే వెబ్సైట్ కి వెళ్లి.. BeneficiaryStatus పై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు డబ్బులు వచ్చాయో లేదో వెంటనే తెలిసిపోతుంది.. ఇటీవలే 12వ విడత డబ్బులు 2022 అక్టోబర్ నెలలో నేరుగా రైతుల ఖాతాలో జమ చేయగా.. ఇప్పుడు గత కొద్ది నిమిషాల క్రితం 13వ విడత డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ అయ్యాయి.