Perni Nani : సినీ నటుడు మోహన్ బాబు తో ఏపీ ముఖ్యమంత్రి పేర్ని నాని భేటీ కావడం సినీ, రాజకీయాల వర్గాల్లో కలకలం రేపింది.. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. మోహన్ బాబు పిలిస్తేనే వాళ్ళ ఇంటికి వెళ్లాను అని.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు..!!2002 నుంచి మోహన్ బాబు కుటుంబంతో తనకు వ్యక్తిగతమైన నా అనుబంధం ఉందని.. బొత్స సత్యనారాయణ ఇంట్లో పెళ్ళికి వెళ్లి మోహన్ బాబు ఇంట్లో కాఫీ తాగి వచ్చానని పేర్ని నాని తెలిపారు.
సినిమా ఇండస్ట్రీ వారికి పరిష్కారం లభించిందని ఆనందం తెలియజేస్తుంటే.. చంద్రబాబు మాత్రం విమర్శిస్తున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. నిన్న మీటింగ్ కి ఆయన వచ్చి ఏమైనా విన్నారా.. ప్రభుత్వం తరఫున ఎవరికీ సంజాయిషీ ఇవ్వలేదని చెప్పారు.చంద్రబాబు హయాంలో సినిమా పరిశ్రమకు ఏమైనా న్యాయం చేశారని పేర్నినాని ప్రశ్నించారు. సినీ జనాలను రాజకీయాలకు వాడుకోవడం, ఎన్నికల్లో ప్రచారానికి పిలవడం తప్పించి.. చంద్రబాబు సినిమా పరిశ్రమకు ఏ విధంగా ఉపయోగపడ్డాయని పేర్ని నాని చురక అంటించారు.
తనకు నచ్చిన వారిని ఒక విధంగా నచ్చని వారిని మరొక రకంగా చూస్తారని ఆయన ఆరోపించారు. దర్శకుడు గుణశేఖర్ ను అడిగితే చంద్రబాబు గురించి కథలు కథలుగా చెబుతారని మంత్రి చురకలు వేశారు. చిరంజీవి సినిమాను ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఆయన సోదరుడు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారని అని ఆరోపించారు. సినిమా వాళ్ళు ధైర్యంగా పని చేసుకునే అవకాశం సీఎం జగన్ కల్పించారని అన్నారు. చంద్రబాబు మొన్న ఏడ్చినట్టు గానే మళ్లీ ఇప్పుడు కూడా ఏడుస్తారు అని ఆరోపించారు.