పెర్ని నాని కొడుకు.. పెర్ని కిట్టు కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రజలు– రోడ్డు మీదే.!

పేరు ఒకరిది అయితే పెత్తనం మరొకరిది.. ఇప్పుడు ఈ సామెత ఎందుకంటే.. ఇది చదివాక మీకే అర్థమవుతుంది.. తండ్రి అధికారంలో ఉంటే కొడుకు పెత్తనం చేస్తున్నాడు.. వచ్చే ఎలక్షన్లకు కాబోలు అని మరి కొందరు అనుకుంటుంటే.. ఈ బడాయి మా వల్ల కాదు బాబోయ్ అని ప్రజలు లబోదిబోమంటున్నారు.. ఇది ఎక్కడో కాదు మన ఆంధ్రాలోనే.. తాతల నాటి చరిత్ర ఉన్న కుటుంబం కావడంతో ప్రజలు కూడా ఎదురు చెప్పలేని పరిస్థితి .. కానీ కొంత మంది ఆయన ముఖం మీదే నీ వల్ల ఈ సమస్య పరిష్కరించడం కాదు.. వెళ్లి మీ నాన్నని రమ్మని చెప్పడం గమనార్హం..!

మచిలీపట్నం నియోజకవర్గ పేర్ని వెంకట్రామయ్య కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది.. ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి కాంగ్రెస్ లోనూ స్వాతంత్ర సంగ్రామం లోను పేరు తెచ్చుకున్నాడు ఆయన కుమారుడికి రాజకీయాల్లోకి వచ్చిన మంచిగా పని చేస్తున్నావ్ అంటూ చక్కటి గుర్తింపుని తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు ఆయన వ్యవహారం విపక్షాలకు ఆయుధాలు అందించినట్లు అనిపిస్తుంది బందరులో జరిగే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో అధికారులను వెంటబెట్టుకొని మాజీ మంత్రి తనయుడు పేరుని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు పర్యటనలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం మెడికల్ కళాశాల భవనాల పనులను పరిశీలించడం నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు కిట్టు పాత్రను లేకుండా చూడలేమని అంటున్నారు. మాజీ మంత్రి తన రాజకీయం బందరు నియోజకవర్గంలో అధికమైందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో నగరంలోని డివైస్లలో ప్రజలకు ఏదైనా అవసరం పడి మాజీ మంత్రి కార్యాలయానికి వస్తే ఈ పని కాదని ముఖం మీదే ఆయన కుమారుడు కిట్టు చెబుతున్నాడని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు సీనియర్ నాయకులు కూడా ఇదే తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు..

గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి తనయుడు పేరుని కిట్టు నగరంలోని 28వ డివిజన్లో పర్యటించారు. తమ డివిజన్ పరిధిలో ఏ హోదాలో పర్యటిస్తున్నావు అంటూ ఆయనని కొంతమంది నిలదీశారు.. కోనేరు సెంటర్లో బాదంపాలు విక్రయించే షాపుల విషయంపై సమస్యను పరిష్కరించాలని చెప్పినా.. అతని మాట ఎక్కడా ఎవరూ వినలేదు మాజీ మంత్రి వస్తే మాట్లాడుకుందాం అని నిర్ణయించుకున్నామని ముస్లిం పెద్దలు అన్నారు.. గడపగడపకు కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకుందామని అనుకున్నామని.. మీకు చెబితే ఈ సమస్య పరిష్కారం కాదని పేర్ని కిట్టుకు తెగేసి చెప్పడం హైలైట్..