Payyavula Keshav ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా వైసీపీ బలంగా ఉన్నచోట గెలవడం జరిగింది. దీంతో టీడీపీ క్యాడర్ తో పాటు అధినేత చంద్రబాబు ఫుల్ సంతోషంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఎమ్మెల్సీ పట్టాభద్రుల గెలుపు పై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫస్ట్ టైం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలోనే రెండు గెలవడం జరిగింది అని పేర్కొన్నారు. అయితే ఇది సమాజంలో మొత్తం అన్ని వర్గాలు రిప్రజెంట్ చేసే ఓటర్ యొక్క నాడి కాదని.. సజ్జల చెప్పుకొచ్చారు. అటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ఆధారం చేసుకుని మొత్తం ఓటర్లకు లింకు పెట్టడం సరైనది కాదని పేర్కొన్నారు.
అయితే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్ట్రాంగ్ గా కౌంటర్ లు ఇచ్చారు. రాష్ట్రంలో అరాచకం ఉందని ప్రజలు ఎప్పుడో గుర్తించారు. అందువల్లే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల రూపంలో తమ తీర్పు చెప్పారు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వై నాట్ 175 అనే గొంతులు సైలెంట్ అయిపోయాయని పేర్కొన్నారు. మొన్నటివరకు ప్రజలు , ప్రజాస్వామ్యం అనే పదాలు వైసీపీ డిక్షనరీలోనే లేవు. వైసీపీ డిక్షనరీ లోని లేని పదాలను సజ్జల మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఒకే ఒక్క షాకుతో సజ్జలకు ప్రజలు గతాన్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు ఇంకా ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడుతున్నారు అని చెప్పుకొచ్చారు. బుల్డోజ్ అనేది వైసిపి కి కేరాఫ్ అడ్రస్. ఆనాడు కరోనా చికిత్స సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ పై అరాచకం నుంచి మొన్న పశ్చిమ రాయలసీమ అభ్యర్థినీ పోలీసులు అరెస్టు చేయటం బుల్లోజ్ చేయడం కాదా అని విమర్శించారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అరాచకాలు వైసీపీ చేస్తుందని మేము నమ్ముతున్నాం.. దేనికైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదే ముఖ్యమంత్రికి నమ్మకం లేదు. అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులని పర్యవేక్షకులుగా పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో మేము పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారు అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. మా పార్టీ సంఖ్యా బలం 23. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను లాక్కున్నది ఎవరు. పోటీ చేయడాని కూడా తప్పు పడతారా..?, మీ ఓటర్లు లేరా..?, ముఖం మీద మేము పలానా పార్టీకి చెందిన ఓటర్ అని ఎవరైనా స్టిక్కర్ వేసుకుంటారా అంటూ పయ్యావుల కేశవ్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు