టాలీవుడ్‌లో నిన్న ఢీకొట్టే మగాడు పుట్టలేదు అంటూ మహేష్‌పై పవన్ హాట్ కామెంట్స్..

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం గుంటూరు కారం. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ క్రింద S. రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రీలీల, జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుంటూరు కారం మహేష్ బాబు యొక్క 28వ చిత్రం. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అఫీషియల్ అప్‌డేట్స్‌ వల్ల విపరీతమైన బజ్‌ క్రియేట్ అయింది. గుంటూరు కారం వచ్చే ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం సినిమా పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా పోస్టర్‌, లుక్కు, గ్లింప్స్‌ అన్ని చూసిన తర్వాత మహేష్ బాబు స్టైల్ కి, మాస్ అవతారానికి పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారట. అంతేకాదు “టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్ను ఢీకొట్టేవాడు ఇప్పటివరకు పుట్టలేదు మహేష్ బాబు” అంటూ హాట్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కి మహేష్ బాబు అంటే మొదటి నుంచి ఇష్టమే. పైరసీ సీడీల వ్యవహారంలో పవన్ మహేష్ బాబుకి ఎంతగా సపోర్ట్ చేశాడో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. మహేష్ కి కూడా పవన్ అంటే మంచి అభిమానం. వీరిద్దరి మధ్య ఇంత మంచి బాండ్ ఉంది కాబట్టే ఒకరి సినిమాను మరొకరు ఎప్పుడూ సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. మహేష్ పవర్ నటించిన జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకి కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించాడు.

ఇలా మహేష్ బాబు మెగా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడిగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ గుంటూరు కారం సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరి మహేష్ బాబు దీనిపై ఎలా రియాక్ట్ అయ్యాడో ఇంకా తెలియ రాలేదు.