పవన్ గారు మీరే మాకు దిక్కు… సహాయం చేయాలంటూ ఏడ్చిన జీవిత రాజశేఖర్?

మెగాఫ్యామిలీకి, జీవిత రాజశేఖర్ కుటుంబానికి మొదటినుండి కొన్ని కొన్ని పొరపొచ్చాలు వున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగానీ సమయం, సందర్భం వచ్చినపుడు జీవిత రాజశేఖర్ కుటుంబం మెగాస్టార్ పైన తమ అక్కసుని వెళ్లగక్కుతూ వుంటారు. ఈ క్రమంలోనే పరువు నష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు షాక్ ఇస్తూ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ సంచలన తీర్పు వెలువరించిన సంగతి అందరికీ తెలిసినదే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై వారు చేసిన ఆరోపణలకుగాను, దాఖలైన పరువు నష్టం దావాపై విచారణ జరిపిన కోర్టు మొన్న మంగళవారం నాడు ఈ దంపతులకు ఏడాది జైలు శిక్ష, 5000 రూపాయలు జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

ఇక ఈ కేసు పూర్వపరాలు ఒకసారి చూస్తే, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి తెలియని తెలుగు జనాలు ఉండనే వుండరు. ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి అవసరమైన వారికి రక్తాన్ని అందిస్తూ సేవ చేస్తున్నారు చిరు. అయితే 2011లో ఒక ప్రెస్ మీట్లో జీవిత రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో వారి వ్యాఖ్యలు పెనుదుమారాన్ని సృష్టించాయి. ఇక ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్ గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు.

చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ వుంటాయని, ఎంతోమందికి సహాయం దొరుకుతుందని, అటువంటి చిరంజీవి పరువుకు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవిత రాజశేఖర్ లపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో వారు చేసిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సిడి రూపంలో కోర్టుకు సమర్పించారు కూడా. దీంతో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు నిన్న తీర్పును వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతో పాటుగా, 5000 రూపాయలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో జరిమానా చెల్లించిన వారిద్దరు నుంచి పూచీకత్తులను సమర్పించి బెయిల్ తీసుకుని విడుదలయ్యారు.

ఈ విషయం వెలువడిననాటినుండి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. చేసినపాపం ఊరికే ఉండదు… మెడకు చుట్టుకుంటుంది అన్నట్టు.. ఎప్పుడో 2011లో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగాను, చిరంజీవి స్థాపించిన పార్టీ ప్రజారాజ్యానికి ప్రతికూలంగాను మాట్లాడుతున్న నేపథ్యంలో జీవిత రాజశేఖర్ దంపతులు నోరు జారారు. అయితే కాలం ఊరికే ఉండదు కదా. చేసిన తప్పుకి దండన విధించింది. మరి ఈ కేసులో జిల్లా కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్న జీవిత రాజశేఖర్ కు అక్కడైనా పరిస్థితి అనుకూలంగా ఉంటుందా? లేదా అన్నది భవిష్యత్ లో తేలనుంది. ఏదిఏమైనా ఈ విషయం వెలువడిననాటినుండి మెగాభిమానులు అయితే ‘మా చిరు బంగారం… అనవసరంగా వారిని ఏమన్నా అంటే ఇలాగే ఉంటుంది!’ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.