AP Political : ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త కోణం చోటు చేసుకోనుందా.!?

AP Political : ఎవరు ఊహించినటువంటి కాంబినేషన్ ప్రజల్లోకి వెళ్ళనుందా? నందమూరి, మెగా సూపర్ స్టార్లు ఒకే వేదికపై ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారా.!? ఈ చర్చపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతుంది. జనసేనని పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సరికొత్త కోణం తీసుకురావాలని ప్రజల్లో చైతన్యం నెలకొలపాలని.. గత రెండేళ్లుగా ఆయన సొంత డబ్బులతో చనిపోయిన రైతులకు తన వంతు సహాయంగా రైతు కుటుంబాలను ఆదుకున్నారు..

Advertisement

ప్రజల్లో ఎంతో కృషితో తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా నేను ప్రజల మనిషిని మీలో ఒకరిని అని నిరూపించుకుంటూ ప్రజల్లో చైతన్యం రావాలి అని ఆయన ప్రజా బాట చేస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిజెపితో కలిసి నడుస్తున్నారు. అయితే ఎన్నికల సమయానికి బిజెపితో కలిసి ఉంటూనే.. టిడిపిని కలుపుకుంటారా..

Advertisement
Pavan Kalyan junior NTR on political news
Pavan Kalyan junior NTR on political news

లేకపోతే బిజెపిని వదిలేసి టిడిపి తో పొత్తు పెట్టుకుంటారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆయన బిజెపిని వదిలి ప్రచారం చేసేటట్లు సూచనలు ఏమీ లేవు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ని బిజెపికి మద్దతు తెలిపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మాటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా తెలిపారు.. ఈ కథానాయకుడు ఇద్దరూ కలిసి ఒకే జెండాపై కలిసి పని చేస్తారా లేదా చూడాలి..

Advertisement