Oukitel WP 19 Phone : ఇటీవల కాలంలో అత్యాధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ప్రతి విషయాన్ని కూడా మనం కేవలం చేతివేళ్ల లోని పూర్తి చేయగలుగుతున్నాము. కేవలం ఏదైనా తెలుసుకోవడం మాత్రమే కాదు దేశం నలుమూలల ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోవడంతో పాటు లక్షల రూపాయలు డబ్బు లావాదేవీలు కూడా కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తూ బ్యాటరీ త్వరగా అయిపోతుంది అంటూ బాధపడుతూ ఉంటారు. ఇక ఫుల్ ఛార్జింగ్ ఒకసారి పెడితే కేవలం ఒక రోజు మాత్రమే వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే అత్యాధునిక టెక్నాలజీ లతో పలు టెక్ సంస్థలు కూడా బ్యాటరీ బ్యాకప్ తో పూర్తీ సామర్థ్యంతో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రోజులు రావాలి అంటే మనం ఇతర మొబైల్ చార్జర్ లను ఉపయోగించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే బ్యాటరీ కొంత కాలం వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా ఏ స్మార్ట్ఫోన్ అయినా సరే అతి పెద్ద సమస్య బ్యాటరీ అటువంటి పరిస్థితుల్లో కంపెనీలు ఇప్పుడు మరింత సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి.
ఇకపోతే ఇప్పటివరకు అధికంగా మనం మార్కెట్లో 7000ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ తో కూడిన స్మార్ట్ఫోన్లు మాత్రమే చూసాము.కానీ మరికొన్ని హ్యాండ్సెట్ల అయితే పదివేల ఎమ్ఏహెచ్ బ్యాటరీ తో కూడా వస్తున్నాయి. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే చైనా కి చెందిన ఒక స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ ఏకంగా 21000 mah బ్యాటరీ తో కూడిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నం చేసింది. ఇక అందులో భాగంగానే ఇటీవల విడుదల చేసినట్లు సమాచారం. ఇక చైనీస్ బ్రాండ్ Oukitel WP 19 ఫోన్ ను విడుదల చేసింది ప్రస్తుతం ఈ మొబైలు 21,000 MAH బ్యాటరీ తో లభిస్తుంది . ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత ఏకంగా 94 రోజుల పాటు మీరు ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే కంపెనీ ప్రకారం మీరు ఈ ఫోను 122 గంటలపాటు నిరంతర ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు అలాగే 123 గంటల వరకు ఆడియో ప్లే బ్యాక్.. 2252 గంటలు అంటే 94 రోజుల పాటు స్టాండ్బై టైమ్ తో ఈ ఫోన్ నడుస్తుంది. ఇకపోతే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.
అయితే 27 W ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో అందుబాటులో ఉంది. ఇక ఈ కొత్త ఫోను దృఢమైన పరికరం ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీరు ఉపయోగించవచ్చు. ఒకవేళ పగిలినా కూడా ఈ మొబైల్ నిరంతరాయంగా పని చేస్తుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే 6.78 అంగుళాల డిస్ప్లే కూడా కలదు. పూర్తి హెచ్డి ప్లస్ రిజల్యూషన్ అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో మనకు ఈ మొబైల్ లభిస్తుంది. ఇక ఈ మొబైల్ లో మీడియా టెక్ helio G95 ప్రాసెసర్ తో మనకు లభిస్తుంది ఇక ఈ ఫోన్లో 8GB ర్యామ్ తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మనకు లభిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ రియల్ కెమెరా సెట్ అప్. ఇక ప్రధాన లెన్స్ 64MP.. టు ఎంపీ మైక్రో కెమెరా అలాగే 20 MP సోనీ నైట్ విజన్ ఐ ఆర్ మాడ్యూల్ ని కూడా పొందుతారు. ఇక 16MP ఫ్రంట్ కెమెరా అంటే సెల్ఫీ కెమెరా ని మీరు పొందవచ్చు. ఇక దీని ధర విషయానికి వస్తే ఇంకా భారతదేశంలో ప్రారంభించబడి లేదు. ఐరోపాలో దీని ధర 694 యూరోలు కాగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 57,500 రూపాయలకు పొందవచ్చు. అంతేకాదు ali express నుంచి మీరు హ్యాండ్సెట్ ను కూడా సొంతం చేసుకోవచ్చు.